Home / Entertainment / ‘420’ గా యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌!

‘420’ గా యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌!

Author:

టెంపర్ సినిమాతో తన నటనలోని ఇంకో కొణాన్ని చూపించి, నాన్నకు ప్రేమతో అంటూ మరుపురాని విజయం తన ఖాతాలో వేసుకొని ఈ మధ్యనే జనతా గ్యారేజ్ తో తన సత్తా ఎమిటో చూపించాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌. జనతా గ్యారేజ్ తర్వాతి సినిమాను టెంపర్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు పూరితో చేయడానికి రెఢీ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ కి, యంగ్ టైగర్ కి ఒకే రోజు చెరో కథ చెప్పి ఒప్పించాడు ఈ డైనమిక్ డైరెక్టర్. పక్క మాస్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్ గా నిలిచే పూరి ఇప్పుడు మరో సారి తనలోని మాస్ ఆలోచనలన్నీ కలిపి యంగ్ టైగర్ ని 420 గా చూపించబోతున్నాడు. ఇజం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న పూరి దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తీ చేసి 420 సినిమాపై కూర్చోనున్నాడు.

ntr-next-movie-420

మరో వైపు సుప్రీం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ కోసం ఒక కథను సిద్ధం చేసి వినిపించాడట ఆ కథ కూడా తనకి నచ్చడంతో ఆలోచించి చెబుతా అనడంతో అనిల్ కూడా యంగ్‌ టైగర్‌ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రంతో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు మన యంగ్‌ టైగర్‌. మరి ముందుగా అయితే 420 కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

(Visited 271 times, 1 visits today)