Home / Entertainment / నాన్నకు ప్రేమతో మొదటి రికార్డ్

నాన్నకు ప్రేమతో మొదటి రికార్డ్

Author:


విడుదలకు ముందే రికార్డు కొట్టాడు నందమూరి యంగ్ టైగర్. మామూలుగానే రికార్డుల్లో పోటీ పడే జూనియర్ తన కొత్త సినిమా “నాన్నకు ప్రేమతో” టీజర్ తోనే రికార్డులకు శ్రీకారం చుట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా..! సెట్స్‌ పైకి వెళ్ళిన రోజు నుంచే అంతటా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ఈ సినిమా, తాజాగా విడుదలైన టీజర్‌తో సంచలనంగా మారిపోయింది. దసరా కానుకగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించి ఓ 30 సెకండ్ల నిడివి గల టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌ లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ఇప్పటి వరకూ ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ 30 లక్షల పై చిలుకు వ్యూస్ సాధించి తెలుగు సినిమా టీజర్స్ విషయంలో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక గతంలో ఏ ఒక్క తెలుగు సినిమా టీజర్‌కూ ఈ సినిమాకు వచ్చినన్ని హిట్స్ రాకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లైక్స్ విషయంలోనూ నాన్నకు ప్రేమతో రికార్డు కొట్టింది. సుమారు 48,000 పైచిలుకు లైక్స్‌తో ఈ టీజర్‌ టాప్‌లో నిలిచింది. సినిమా లో తన పాత్ర ఎలా ఉండబోతోందో ముందే ఒక జర్క్ తో చూపించాడు ఎంటీఆర్. నెగెటివె షేడ్ లో ఉండే హీరో పాత్రని ఎలా చేయాలో చూపించే విధంగా ఉండబోతోందట ఈ పాత్ర.

తాత కాలం అయిపోయి మనవళ్ళ కాలం వచ్చింది మరి ఇప్పుడు నెగెటివ్ హీరో అంటే ఎలా ఉండాలి.. విలన్ గ్యాంగ్ లో ఒక్కొక్కడికీ ఆ రూపం గుర్తొస్తేనే ప్యాంట్లు తడిసిపోవాలి. ఆ చేతికి దొరికి పోతే అన్న ఆలోచనే ప్రాణాభయం కలిగించాలి.అదే… పాత్ర ప్రేక్షకుడి రక్తాన్ని మరిగించాలి, ఒక్కో సీన్ లో రోమాలన్నీ నిక్క బొడుచుకోవాలి మొత్తనికి జూనియర్ ఎంటీఆర్ లా ఉండాలి.విల‌న్‌ల‌ను ఎన్ని ముప్పు తిప్పులు పెడితే తామే ఆ పొజిష‌న్‌లో ఉన్న‌ట్లు అభిమానులు ఊహించుకుంటారు. హీరో ఎంత శాడిజంతో ఉంటే.. శ‌త్రువులు అంత మెంటల్ ఎక్కిపోతారు. ఇప్పుడు ఇలా త‌న శ‌త్రువుల‌కి త‌న టెంప‌ర్ చూపి శ‌త్రువుల‌కు పిచ్చెక్కించేందుకు సిద్ధ‌మైపోతున్నాడు యంగ్ టైగ‌ర్‌. సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న “నాన్నకు ప్రేమతో” లో జూనియర్ తన నట విశ్వరూపాన్ని చూపించ బోతున్నాడట. ఇందులో యంగ్ టైగర్ ది డ్యూయెల్ రోల్ అన్న సంగతి తెలుసు కదా ఆ ఇద్దరిలో ఒక పాత్ర శాడిస్ట్ లకే శాడిస్ట్ లా ఉంటుందట. ఒక్కొక్కరినీ ఒక్కో పద్దతిలో చిత్ర హింసలు పెట్టెటంత శాడిజం తో పగతో రగిలి పోతుందట ఈ పాత్ర.ఇకనేం మనోడికి ఇలాంటి పాత్రలంటే కొట్టిన పిండి ఇంక యంగ్ టైగర్ చెలరేగి పోయినట్టే అంటూ ఆనంద పడిపోతున్నారు అభిమానులు.

ఇక గతంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌తో ఎన్టీఆర్ ఈ టీజర్‌తో కట్టి పడేశారు.సుకుమార్ మార్క్ స్టైలిష్ మేకింగ్ ఈ టీజర్‌లో స్పష్టంగా కన బడుతోంది. ఎన్టీఆర్ లుక్, చిన్న చిన్న స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కు అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

 

(Visited 72 times, 1 visits today)