Home / Entertainment / యన్.టి.ఆర్ తో ‘అందాల ‘ డైరెక్టర్

యన్.టి.ఆర్ తో ‘అందాల ‘ డైరెక్టర్

Author:

ntr movie with hanu

అందాల రాక్షసి ఒక్క సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఎవరు ఈ డైరెక్టర్ అని అనుకునేలా చేశాడు హను రాఘవపూడి. ఎందుకంటే ఈ అందాల రాక్షసి సినిమా అనేది ఒక పోయెటిక్ ఫీల్ సినిమా దానినీ చాలా అంధంగా చాలా క్లాస్ గా తీశాడు. ఇక ఆడియో గురించి ఎంత చెప్పితే అంత మంచిది ఆ సంవత్సరం బెస్ట్ మ్యూజిక్ గా ఆ సినిమా నిలిచిపోయింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు స్టోరిపై కూర్చోని ఇప్పుడు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ తో మరో బ్లాక్ బ్లాస్టర్ సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకులకు ఒక విందు బోజనం వడ్డించేశాడు హను. నాని కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీనితో ఇప్పుడు తనని అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. జూనియర్ యన్. టి. ఆర్ తో సినిమా ఒకె అయినట్లు తెలిసింది. హను ఈ మధ్య యన్. టి. ఆర్ ని కలిసి ఓ కథ చెప్పాడట. ఆ కథ జూనియర్ కి విపరీతంగా నచ్చేయడంతో హను కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. ఇప్పుడు హను ఆ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దేపనిలో పడినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఆఫిషియ అనౌన్స్ మెంట్ రానున్నది.

(Visited 377 times, 1 visits today)