Home / Inspiring Stories / వాహనాలు బేసి “సరి”గా లేకుంటే 2000 జరిమాన.

వాహనాలు బేసి “సరి”గా లేకుంటే 2000 జరిమాన.

Author:

Delhi Odd Even Rule

దేశ రాజధాని డిల్లీ లో గాలి ఎప్పుడో విషపూరితమైపోయింది. స్లో పాయిజన్‌ లా ప్రజల్ని చంపేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ మాత్రం నివాస యోగ్యంకాని ఢిల్లీలో ఉంటున్న జనం స్లో మోషన్‌ లో మరణ శిక్ష అనుభవిస్తున్నారు. వెహికిల్స్‌ వెలువరించే విషపూరిత వాయువులకు దుమ్ము, ధూళి తోడవడంతో పరిస్థితి అంతకంతకు దారుణంగా మారుతోంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఢిల్లీ.. పర్యావరణం విషయంలో మాత్రం ఎంతో వెనకబడిపోయింది. వాల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్ మెగా నగరాల్లో ఢిల్లీకి అట్టడుగు స్థానం ఇచ్చిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో పొల్యూషన్‌.. కంట్రోల్‌ చేయలేని స్థాయికి పెరిగిందంటే పాలకుల నిర్లక్ష్యం, విధాన నిర్ణయాల్లో జాప్యమే ప్రధాన కారణం. గాలిలో అల్ట్రాఫైన్‌ పార్టికల్స్‌, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నాసిరకమైన ఇంధన వనరుల వినియోగం ఢిల్లీలో భయంకరమైన వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. 2010 నాటికి ఢిల్లీలో వాహనాల సంఖ్య 47లక్షలు కాగా… 2030 నాటికి అది రెండున్నర కోట్లకు చేరుతుందన్నది ఒక అంచనా. ఇదే నిజమైతే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య ఉపద్రవం ఢిల్లీలో చోటు చేసుకోనుంది. 1.3 కోట్లకు పైగా జనాభా ఉన్న ఢిల్లీలో గాలి కాలుష్యం.. చైనా రాజధాని బీజింగ్‌ కన్నా రెట్టింపు. వెహికిల్స్‌, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న పొగ కాలుష్యానికి ప్రధాన కారణాలన్నది అందరికీ తెలిసిన సత్యం. నిజానికి ఢిల్లీలో రోజూ వెయ్యి కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలను పక్కనపెట్టాలన్న నిబంధన ఉన్నా పట్టించుకునే వారే లేరు. ఇటీవల నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ సైతం ఢిల్లీలో పాత డీజిల్‌ వాహనాల వినియోగాన్ని నిషేధించింది. అయినా నిబంధన అమలైన దాఖలాలు లేవు. ఇక పరిశ్రమల నుంచి వెలువడే పొగతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా దాన్ని నియంత్రించడంలో అధికారుల అలసత్వం వల్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రస్తుతం క్లిష్ట సమస్యగా మారింది. ఢిల్లీ రోడ్లపై తిరగడమంటే గ్యాస్‌ ఛాంబర్‌ లో ఉన్నట్లేనని సాక్షాత్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే.. పరిస్థితి చేయిదాటి పోయే అవకాశం లేకపోలేదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మానవ ప్రయత్నం లేనిదే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. ఓ వైపు వ్హో నివేదికలు, మరోవైపు కోర్టుల మొట్టికాయలతో ఢిల్లీ సర్కారుపై ఒత్తిడి పెరిగింది. వాస్తవానికి ఢిల్లీలో పొల్యూషన్‌ కంట్రోల్‌ చేయాలంటే వెహికిల్స్‌ ను నియంత్రించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు రోడ్లపై వాహనాలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. బీజింగ్‌, సింగపూర్‌, పారిస్‌, మెక్సికోల్లో అవలంభిస్తున్న సరి, బేసి సంఖ్యల విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా వాహనాల నెంబర్ ప్లేట్లలో చివరి సంఖ్య ఆధారంగా వాహనాలు రోడ్లపైకి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అంటే చివరి అంకె సరి సంఖ్య అయిన వాటిని ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరుసటి రోజు రోడ్లపైకి వచ్చేలా చూడాలన్నది ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం. ఈ విధానం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ సర్కారు డెసిషన్ బాగుందని కొందరంటే మరికొందరు మాత్రం పరమ చెత్తగా ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించిన బెస్ట్ ఆప్షన్‌ ఢిల్లీ ప్రభుత్వానికి కనిపించడంలేదు.

నానాటికీ పెరిగి పోతున్న విపరీతమైన కాలుష్యం దృష్ట్యా చైనా రాజధాని బీజింగ్ నగరంలో విజయవంతంగా అమలు చేస్తున్న సరి-బేసి వాహనాల విధానాన్ని జనవరి ఒకటోతేదీ నుంచి మన దేశ రాజధాని లోనూ అమలు చేయనున్నట్టు ఢిల్లీ రాష్ట్ర సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. సరి-బేసి విధానం అంటే వాహనం నంబరు చివరన సరి సంఖ్యలో ఉండే వాహనాలు ఒక రోజు రఒడ్డెక్కితే రెండోరొజు అంటే సరిసంఖ్య వాహనాల తర్వాతి రోజు బేసి సంఖ్య ఉండే వాహనాలను మాత్రమే రోడ్ల మీదకు అనుమతిస్తారన్న మాట. దీనివల్ల కాలుష్యమూ, ట్రాఫిక్ సమస్యలు రెండూ పరిష్కారమౌతాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం కాని అమలు జరిగితే జనవరి 1 నుంచి దాదాపుగా రోజువారీగా రోడ్ల మీదకు వచ్చే వాహనాల్లో 50 శాతం తగ్గిపోతాయి.

సరి, బేసి నంబరుగల వాహనాల ఫార్ములాను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించాలని ఢిల్లీ రవాణాశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకి రూ.2000 జరిమానా విధించే అవకాశముంది. ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్ వద్దకు వెళ్లిందని, త్వరలోనే దీనిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశముంది. నానాటికీ పెరిగి పోతున్న ఢిల్లీ కాలుష్యం పై కఠిన నిర్ణయం తీసుకుంది దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీ డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీం ఉక్కుపాదం మోపింది. 2000 సీసీ దాటిన డీజిల్ ఎస్‌యూవీలు, కార్ల అమ్మకాలపై మార్చి 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. 2005 కంటే ముందుగా రిజస్టర్ అయిన ట్రక్కులను ఢిల్లీ పరిసరాల్లోకి ప్రవేశించకుండా నిషేధించేందుకు సుప్రీం అనుమతించింది.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అసలు కొత్త డీజిల్ వాహనాలను రిజిస్టేషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిలిపివేయాలని సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో డీజిల్ కార్ల కొనుగోళ్లు ఆపాలని ఎన్‌జీటీ తెలిపింది. అసలు దేశ రాజధానిలోకి వచ్చే ట్రక్కుల మీద గ్రీన్ టాక్స్‌ను కూడా రెట్టింపు చేసింది. అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ప్రధమ స్థానంలో ఉండటం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ సుప్రీం కోర్టు ఆవరణలో కూడా ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

(Visited 171 times, 1 visits today)