Home / Inspiring Stories / ప్రజలతో పుస్తకాలు చదివించడానికి తమ ఉద్యోగాలు వదిలేశారు.

ప్రజలతో పుస్తకాలు చదివించడానికి తమ ఉద్యోగాలు వదిలేశారు.

Author:

read more India 2015

ఒడిశాకు చెందిన శతాబ్ది మిశ్రా, అక్షయ రౌతరే లకు పుస్తకాలంటే చెప్పలేనంత ఇష్టం. కంప్యూటర్లూ,మొబైల్ ఫోన్లతో భారతీయుల్లో పుస్తకం చదివే ఆసక్తి క్రమక్రమంగా తగ్గిపోతుండడం ఆ ఇద్దరినీ కాస్త భాదకు గురి చేసింది. ఎలాగైనా పుస్తక పఠనాసక్తిని ప్రజల్లో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎలా తమదగ్గర మరీ అంత ఎక్కువ డబ్బుకూడా లేదు… అంతంతమాత్రంగానే ఉన్న వనరులతోనే ఈ తమ ఉధ్యమాన్ని మొదలుపెట్టారు. ముందుగా తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలేశారు. భుజాలకు రెండు బ్యాక్ ప్యాక్‌లను తగిలించుకొని వాటి నిండా పుస్తకాలను నింపుకొని పాదయాత్రకు బయల్దేరారు. వీలున్న చోటల్లా పుస్తకాలను పరిచి స్థానికులను ప్రోత్సహించడం ప్రారంభించారు. ముఖ్యంగా పుస్తకాలు అందుబాటులోలేని గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారు. స్థానికులకు అక్కడే కూర్చొని తమ వద్దనున్న పుస్తకాలను ఉచితంగా చదివే అవకాశం కల్పించారు. కొనాలనుకునే వాళ్లకు 20 శాతం డిస్కౌంట్‌కు పుస్తకాలను విక్రయించడం మొదలు పెట్టారు. ఇలా దేశంలోని పల్లెలు, పట్టణాలన్నింటిని చుట్టి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదట్లో అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ నెమ్మదిగా పల్లెల్లోని జనాలకు అవగాహణ కలిగించటం లో కాస్త మెరుగయ్యామనీ, దాంతో వీరి ప్రయత్నానికి వెల్లిన ప్రతీ చోటా మంచి స్పందన వస్తోందనీ అంటున్నారీ పుస్తక జంట. స్థానిక ప్రజలతో తాము మమేకవడం, ప్రదర్శన వద్ద ఉచితంగా పుస్తకాలను చదివే అవకాశాలను కల్పించడం వల్ల కూడా వీరి వుద్దేశం పట్లా రెస్పాన్స్ పెరుగుతోందని వివరించారు. కథలు, నవలలను, ప్రపంచ దేశాల సంస్కృతి పట్ల అవగాహన కల్పించే పుస్తకాలను మాత్రమే అమ్ముతారు వీళ్ళు, అకడమిక్ పుస్తకాలు మాదగ్గర ఉండవు ఎందుకంటే అవి మామూలుగా ఏ స్కూల్ లో అయినా దొరుకుతాయి. పాఠ్య పుస్తకాలను తెగ చదివి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఆరాటపడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులున్న నేటి సమాజంలో కథలు, నవలల పట్ల ఆసక్తి చూపడం తక్కువేనన్న విషయం తెలిసికూడా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటనను మొదలు పెట్టామని అంటున్నారు వీళ్ళు.

read more india

ఈ ఇద్దరి తపననీ గమనించిన కొందరు మిత్రులు వీరికోసం ఓక సెకండ్ హాండ్ మారుతి ఓమ్నీ కారును కొనిచ్చారు. దీనికి ఎంతో ఆనందించిన ఆ జంట ఇక దేశ పర్యటనకు ఏ మాత్రం ఢోకాలేదని భావించారు. ‘రీడ్ మోర్ ఇండియా 2015’ అనే నినాదంతో వారు ఒడిశా నుంచి పర్యటన ప్రారంభించారు. ఒడిశాలోని 30 జిల్లాలను పదివేల కిలోమీటర్లు ప్రయాణించి కవర్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా తమ పుస్తక ప్రచారాన్నిసాగించి, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులోకి అడుగుపెట్టారు. గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలతోపాటు మొత్తం రాష్ట్రాల్లో పర్యటించి మొబైల్ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నదే వారి ముందున్న లక్ష్యం.

(Visited 229 times, 1 visits today)