Home / Entertainment / ఒక్క అమ్మాయి తప్ప సినిమా రివ్యూ & రేటింగ్.

ఒక్క అమ్మాయి తప్ప సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Oka-ammayi-thappa-perfect-review-rating

సంధీప్ కిషన్,నిత్యమీనన్ జంటగ రచయిత రాజసింహ తడినాడా మొదటిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఒక్క అమాయి తప్ప. ఎప్పుడు విలక్షణ పాత్రలు ఎంచుకునే సంధీప్ కిషన్ మరియు నిత్యమీనన్ జంట అనగానే అందరికి ఒక్కసారిగా అంచానాలు ఎక్కువైపోయాయి. ఈ రోజు మన ముందుకు వచ్చింది. ఒక్క సారి ఎలా ఉందో చూద్దాం.

కథ:

ఎప్పుడు అల్లరి చిల్లరగా తిరిగే సంధీప్ ఒకచిన్న పనిమీద బయటకి వెళ్తూ ట్రాఫిక్ జాం అయిన హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై నిత్యని చూడగానే  తన చిన్ననాటి స్నేహితురాలు లానే ఉంది అని అనుకుంటాడు,తన తొలి చూపులోనే నిత్యాని ప్రేమించడం మొదలు పెడుతాడు.ఆమెని ప్రేమలో పడేసేందుకు నానాతంటాలు పడతాడు.

నిత్య ప్రేమలో పడే సమయంలో విలన్ నుంచి ఇతనికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఫ్లైఓవర్‌పై బాంబ్ ఉందని అతను చెబుతాడు. అది ఎక్కడుందో ఛేదించే పనిలో పడిపోతాడు సందీప్. ఇంతలోనే కొందరు గూండాలు మనోడి వెంట పడతారు. అటు బాంబ్, ఇటు గూండాలు మధ్యలో సందీప్ నలిగిపోతుంటాడు. నిత్యామీనన్‌కి, విలన్‌కి ఏమైనా సంబంధం ఉందా? చివరికి సందీప్ ఆ బాంబ్‌ ఎక్కడుందో కనిపెట్టగలిగాడా? లేదా? అన్నది మీరు థీయేటర్స్ కి వెళ్ళి చూడవలసిందే…

అలజడి విశ్లేషణ:

ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇలాంటి స్టోరిని ఎంచుకున్నందుకు సంధీప్ ని మెచ్చుకోవాలి. ఈ సినిమాలో సంధీప్ పరిపక్వత చెందిన నటుడిలాగా అనిపిస్తాడు. నిత్య మాత్రం చాలా అద్బుతంగా నటించింది. ఈ సినిమాలో సంధీప్ మొదటి భాగంలో కాస్తా సరదాగా కనిపించిన రెండవ భాగంలో మాత్రం చాలా బాగా నటించాడు.

ఇక హీరో, హీరోయిన్ లవ్… కొద్దిగా కామెడీ. కానీ రెండవ భాగం మాత్రం ప్రతి సీన్స్ ఆసక్తికరంగా, అలాగే నాయకుడికి మరియు ప్రతినాయకుడికి మద్య ఉన్న సన్నివేశాలు చాల అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా లోని గ్రాఫిక్స్ మొదటి భాగంలో పెద్దగా బాగా లేకపోయినా రెండవ భాగంలో మెప్పించారు. ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకోవడం లో డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకోవాలి. అలాగే సంగీతం మిక్కి జే మేజర్ పాటలు ఇదివరకే వినేసి ఉన్నాం కనుక పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. మైండ్ గేమ్ లతో మరియు ట్విస్ట్ లతో సినిమా రెండవ భాగం ప్రేక్షకుల మనసు దోచుకుంది అని చెప్పాలి. పృథ్వి రాజ్, తాగుబోతు రమేష్ ల కామెడీతో కొద్దిసేపు నవ్వించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ముందుగా మనం మట్లాడుకోవలసింది ఈ సినిమా డైరెక్టర్ రాజసింహ గురించి.. ఎందుకంటే అతను ఎంచుకున్న స్టోరీలైన్ చాలా కొత్తగానూ, డిఫరెంట్‌గా వుంది. దాన్ని వెండితెరపై చాలా బాగా తెరకెక్కించాడు. మధ్యమధ్యలో కాస్త ఫ్లో తగ్గినా.. ఆ తర్వాత సీన్‌తో సినిమాపై హైప్ పెంచుతూ వచ్చాడు. దర్శకుడిగా ఇతని ప్రతిభను మెచ్చుకోవచ్చు.

ముఖ్యంగా.. ఫ్లైఓవర్ సన్నివేశాలను ఛోటా కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ చాలా అద్భుతం. ఈ సినిమాలో తన పనితనం చాలా భాగుంది. అలాగే మనకు ఎక్కడ ఇది గ్రాఫిక్స్ అని తెలియకుండా చాలా బాగా చూపించాడు. అలాగే కొన్ని లొకేషన్స్‌ని గ్రాండ్‌గా ప్రెజెంట్ చేశాడు. మిక్కి జే.మేయర్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ వర్క్ ఇంకా బాగా చేస్తే బాగుండు. అంజిరెడ్డి నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా వున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • సందీప్ కిషన్, నిత్య మీనన్
  • కథ, స్క్రీన్ ప్లే
  • ట్విస్ట్స్
  • కామెడీ

మైనస్ పాయింట్స్:

  • స్లో నరేషన్
  • ఎడిటింగ్
  • లాజిక్స్ మిస్ అవ్వడం
  • ఫస్ట్ ఆఫ్

అలజడి రేటింగ్: 3/5

పంచ్ లైన్: అంత ఆ అమ్మాయి కోసమే….!

(Visited 3,427 times, 1 visits today)