Home / Entertainment / 18న నిహారిక ఒక మనసు ఆడియో లాంచ్.

18న నిహారిక ఒక మనసు ఆడియో లాంచ్.

Author:

Oka Manasu Audio Launch 1

ఒక మనసు ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఎందుకంటే మెగ ఫ్యామిలి నుండి మొట్ట మొదటి హీరోయిన్ గా నిహారిక ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. ఈ సినిమాలో నిహారికకు జంటగా నాగశౌర్య నటిస్తున్నాడు. మల్లెలతీరంలో సిరిమల్లె చెట్టు అనే ఫీల్ గుడ్ సినిమా అందించిన రామరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే ప్రముఖ టీవీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్, డా. కృష్ణ భట్టలతో కలిసి ‘మధుర’ శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 18న ఆడియో విడుదల చేయానున్నారు. ఈ సినిమా ఆడియోకి మెగ ఫ్యామిలి నుండి ఎంతమంది హాజరు అవుతున్నారో మాత్రం తెలియలేదు. కానీ సమయానికి మాత్రం కచ్చితంగా అందరు వచ్చేందుకు వీలు చూసుకుంటున్నట్టు సమచారం. మెగా ఫ్యామిలి నుండి వస్తున్న హీరోయిన్ కావడంతో ఆడియో ఏర్పాట్లు భారిగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు.

(Visited 347 times, 1 visits today)