Home / Inspiring Stories / పాత రొజులే బాగున్నాయి

పాత రొజులే బాగున్నాయి

Author:

aa rojule baagunnaay

చిన్నతనపు జ్ఞాపకాలు ఇప్పుడు తలచుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలుగా మన ముందు గిర్రున్న తీరుగుతాయి.కానీ ఆ జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇప్పుడు గడుపుతున్న గజిబిజి జీవితం ఒక జీవితమేన అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల(చిన్నతనం)లో మనం ఏం చేసిన అది ఒక జ్ఞాపకం అవుతుంది అని అప్పుడు మనకు తెలియదు. పల్లె జీవితం మనకు సంపూర్ణమైన మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. గుండె నిండ ప్రేమను పంచే అమ్మనాన్న, అలాగే మంచిచెడులు చెప్పే తాత బామ్మలు, ఆత్మీయంగా అన్నిపాలు పంచుకునే అన్నయ్య, అక్కయ్యలు.
ఇక ఆటల సంగతి చెప్పనక్కరలేదు, ఆ రోజులలో ఆడిన ఆటలు ఇప్పుడు లేవు అనిపిస్తుంది. ఎందుకంటె ఇప్పుడు అంత ఇంటర్నెట్ జనరేషన్. చివరకు అన్నం ఎలా తినాలో కూడ నెట్లో చూసి తింటున్న కాలం. ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది కానీ, మన కోసం కాకపోయిన మనవారి కోసం బ్రతకాలి అని బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అయిన వారిని విడిచిపెట్టి పల్లె నుండి పట్నం వచ్చి ఇక్కడ ఇరుకు గదుల్లో, ఇరుకుగా ఉండే మనుషుల మనుసులలో ఇసుమంత అయిన ప్రేమలేదు. కాని ఇప్పుడు పల్లెకు పోయి బ్రతకలేక పట్నంల ఉండలేక ఎంతోమంది వారు తమ ఊరిని, ఊరి జ్ఞాపకాలును, చిన్ననాటి మధురాతి మధురమైన జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతున్నారో……

            ఇవన్ని ఎంతమందికి గుర్తున్నాయో తెలియదు కాని, నాకు నా వాళ్ళందరితో ఇవన్ని పంచుకోవాలని అనిపిస్తోంది. ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కరితో వాళ్ళతో నాకున్న జ్ఞాపకాలు పంచుకోవాలనేది నా కోరిక. వాళ్ళకు ఏమి గుర్తున్నాయో అడిగి తెలుసుకోవాలి. అప్పుడు అందరం ఒకటే. ఇప్పుడు ఎవరికి వారే యమున తీరే .కానీ ఒక సందేశం మన చిన్ననాటి జ్ఞాపకాలను మన ముందుకు తీసుకువచ్చేలా చేస్తు ఫేస్ బుక్, వాట్సప్ లలో గత కొద్దిరోజులుగా ఒక ఊపూ ఉపుతుంది. మరి మీరు చూడండి.

ఆ రోజులు బాగున్నాయ్…
ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మరిచిన
ఆ రోజులు బాగున్నాయ్…
మినరల్ వాటర్ గోల లేకుండా నల్లా దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర నీళ్లు తాగిన
ఆ రోజులు బాగున్నాయ్….
ఎండాకాలం చలివేంద్రాల దగ్గర చల్లని నీళ్ల కోసం
ఎర్రని ఎండని సైతం లెక్క చేయని
ఆ రోజులు బాగున్నాయ్….
వందల కొద్దీ చానళ్ళు లేకున్నా, ఉన్న ఒక్క దూరదర్శన్ లో చిత్రలహరి,ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురుచూసిన
ఆ రోజులు బాగున్నాయ్….
సెలవుల్లో అమ్మమ్మ,నానమ్మ ల ఊళ్ళకు వెళ్లి
ఇంటికి ఎప్పుడు రావాలన్న ఆలోచనే లేని
ఆ రోజులు బాగున్నాయ్….
కార్లు లేకున్నా ఎర్ర బస్సు లో కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన
ఆ రోజులు బాగున్నాయ్…
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిన
ఆ రోజులు బాగున్నాయ్….
మటన్ బిర్యానీ,చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం మామిడికాయ పచ్చడి పెట్టిన రోజున అందరం కలిసి అన్నం తిన్న
ఆ రోజులు బాగున్నాయ్….
జేబు నిండా కార్డులున్నా,పర్సు నిండా డబ్బులున్నా; కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర కాజేసిన
ఆ రోజులు బాగున్నాయ్….
సెల్లు నిండా గేములున్నా;బ్యాటు మార్చుకుంటూ క్రికెట్టాడిన
ఆ రోజులు బాగున్నాయ్…..
బీరువా నిండా జీన్స్ ప్యాంట్లున్నా;
2 నిక్కర్లతో బడికెళ్ళిన
ఆ రోజులు బాగున్నాయ్….
బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా; పావలా ఆశా చాక్లెట్ తిన్న
ఆ రోజులు బాగున్నాయ్….
చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో; పిల్లలం కొట్టుకున్నా సాయంత్రం కల్లా కలిసిపోయిన
ఆ రోజులు బాగున్నాయ్…
ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలున్నా ;
నాన్న కొనకొచ్చే చిరుతిళ్ళ కోసం ఎదురుచూసిన
ఆ రోజులు బాగున్నాయ్….
బట్టర్ స్కాచ్ చల్లగా నోట్లో నానుతున్నా; అమ్మ చీర కొంగు పైసలతో గీతా ఐస్ కొని తిన్న
ఆ రోజులు బాగున్నాయ్…
దొంగల భయం,సెల్ ఫోన్ పోతదనే భయం లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలో చందమామని చూస్తూ నిదురించిన
ఆ రోజులు బాగున్నాయ్…
ఆ రోజులు బాగుంటాయ్;
ఎందుకంటే అవి మళ్ళీ రావు కాబట్టి…..

(Visited 1,773 times, 1 visits today)