Home / Inspiring Stories / భక్తులకు అన్నదానం బదులు బిర్యాని దానం చేస్తున్న “బిర్యాని బాబా”.

భక్తులకు అన్నదానం బదులు బిర్యాని దానం చేస్తున్న “బిర్యాని బాబా”.

Author:

సాధారణంగా మన ఇంట్లో ఏదైన వేడుక జరిగినప్పుడు మనం ఎక్కువగా శ్రద్ద చూపించేది వచ్చిన అతిధులకు వడ్డించే ఆహారం పైనే. ఎందుకంటే? ముఖ్యంగా మనకు మాట వచ్చేది వంటల విషయం లోనే. కానీ, ఒక వ్యక్తి దాదాపు 1000మందికి ప్రతి రోజు బిర్యాని వడ్డించి మరి పెడుతున్నాడు. అన్నదానం బదులు బిర్యాని పెడుతున్నాడు అతనే షరీఫ్ షతాజ్ ఖాదిరి బాబా.. అదేనండి స్థానికులు ఇష్టంగా పిలుచుకునే బిర్యాని బాబా.

biryani baba story

మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లాకు చెందిన 79ఏళ్ళ ఖదిరి దాదాపు 40 ఏళ్ళుగా చీమలపాడు దర్గాలోని లంగర్ ఖానాలో, ప్రతిరోజు నాణ్యమైన చికెన్, మటన్, స్వచ్ఛమైన నెయ్యి, భాస్మతి బియ్యంతో చేసిన బిర్యానీని ఆ దర్గాకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడ్డిస్తుంటారు.
అదేంటి ఎవరైనా భక్తులకు మాములుగా అన్నం పెడుతారు కానీ బిర్యాని పెడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా..! అదే విషయాన్ని బాబాని అడిగితే, ఆయన గురువు ఖాదర్ బాబా నుండి పొందిన ఈ వారసత్వాన్ని స్వీకరించి గత 40ఏళ్ళు గా ఈ పనిచేస్తున్నాడు ఈ బాబా. ఇక్కడికి ప్రతి రోజు దాదాపు వెయ్యి మంది వస్తారు వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే, ఒక్కరికి కూడా తక్కువ కాకుండా వడ్డిస్తారు. పండుగల సమయంలో దాదాపు 10,000మంది వరకు వస్తారు. ఆ సమయంలో కూడా అందరికి సరిపోయే విధంగా బిర్యాని ఏర్పాటు చేస్తారు బాబా గారు.

ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ కులం, ఏ మతం, బీద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఉచితంగా ఈ బిర్యానీని అందిస్తారు. కేవలం బిర్యాని మాత్రమే కాదు ఇక్కడ శాకాహారులకు కూడా ప్రత్యేక భోజన సధుపాయాలను కూడా కల్పించారు. భక్తులు మాత్రం వారికి తోచిన విరాళాలను చేస్తారు.ఈ బిర్యాని కోసం ప్రతి రోజు దాదాపు రెండు టన్నుల భాస్మతి బియ్యం, క్వింటాళ్ళలో చికెన్, మటన్ కొనుగోలు చేస్తారు.

ఇక ఈ విషయంపై బాబా మాటల్లో “నా దృష్టిలో కులం, మతం అంటు లేదు మీ దేవుడు మా దేవుడు అంటు ఎవ్వరూ లేరు దేవుడు ఒక్కడే సగటు మనిషికి సేవ చేయడం మరియు దేవుడికి సేవ చేయడం రెండు ఒక్కటే” అని అన్నారు ఈ బిర్యాని బాబా. ఇలాంటి నలుగురి ఆకలి తీర్చే ఒక మంచి పని ఇంకా అభివృద్ది చెందలని… ఇంకా చాలా మంది భక్తులకు ఇలాంటి ఒక అధ్బుతమైన కార్యక్రమం నిరంతరంగా అందుబాటులో ఉండాలని కోరుకుంటుంది మా అలజడి.కామ్

(Visited 2,332 times, 1 visits today)