Home / Reviews / ఓం నమో వెంకటేశాయ సినిమా రివ్యూ & రేటింగ్.

ఓం నమో వెంకటేశాయ సినిమా రివ్యూ & రేటింగ్.

ఓం నమో వెంకటేశాయ సినిమా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్, రావు రమేష్, ప్ర‌గ్యా జైస్వాల్

Directed by: రాఘవేంద్ర రావు

Produced by: మహేష్ రెడ్డి

Banner: సాయి కృప ఎంటర్టైన్మెంట్స్

Music Composed by: కీరవాణి

నాగార్జున, రాఘవేంద్ర రావు ల కెరీర్ లో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాలు గొప్ప సినిమాలుగా నిలిచిపోయాయి, అలాంటి వారే షిరిడి సాయి సినిమా తీస్తే ప్రేక్షకులకి నచ్చలేదు, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత తిరుమల వేంకటేశ్వరుడిని భక్తుడైన హథీరాం బాబా చరిత్ర పైన ఓం నమో వెంకటేశాయ అంటూ సినిమా తీశారు, ఈరోజు విడుదల అయిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి మరి..

కథ:

దేవుడు పైన అమితమైన భక్తితో చిన్నప్పుడే వేద పాఠశాలలో చేరుతాడు రామ(నాగార్జున), దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తపస్సు చేయాలనీ గురువు ద్వారా తెలుసుకొని తపస్సు మొదలుపెడతాడు, ఆ తపస్సులోనే పెద్దవుతాడు, ఒక కారణం చేత తపోభంగం అయిన తరువాత తిరుమల చేరుకొని దైవ ప్రత్యక్ష దర్శనం కోసం దేవుడి ఆరాధనలోనే మునిగిపోతాడు, అలాంటి పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? లేదా? రామ పై ఆలయ అధికారులు ఎందుకు కక్ష కట్టారు? రామని పెళ్లాడాలి అనుకున్న భవాని (ప్రగ్య జైస్వాల్) ఎవరు..? కృష్ణమ్మ(అనుష్క)కి రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు?చివరగా రామ జీవితానికి ముగింపు ఏంటి..? ఇవన్నీ తెర మీదే చూడాలి.

అలజడి విశ్లేషణ:

వేంకటేశ్వరుడి భక్తుడు అంటే మనకి అన్నమయ్య మాత్రమే తెలుసు కానీ ఉత్తరభారతానికి చెందిన రామ అనే గొప్ప భక్తుడి ఇతివృత్తాన్ని కథగా తీసుకోని రాఘవేంద్రరావు గారు చాలా గొప్పగా తెరకెక్కించారు, ఈ సినిమాని చూడాలంటే ముందుగా అన్నమయ్యని మరిచిపోవాలి, ఆలాగైతేనే ఈ సినిమాలో ఉన్న భావాన్ని పూర్తిగా అర్థంచేసుకోగలుగుతాం.

దేవుడి ప్రత్యక్ష దర్శనం కోసం హథీరాం తపస్సు, వేంకటేశ్వరుని మరో భక్తురాలు కృష్ణమ్మా నేపథ్యంలో తొలిభాగం సాగుతుంది, రెండవ భాగంలో తిరుమల ఒక గొప్ప ఆలయంగా నిలిచిపోవడానికి కొండపై హాథిరాం బాబా చేసిన కార్యక్రమాలు, దేవుడి దర్శనం కోసం హథీరాం బాబా చేసిన తపస్సు  చుట్టూ ఉంటుంది, రెండవభాగంలో వేంకటేశ్వరుడు హాథీరాం బాబాకు దర్శన భాగ్యాన్ని కల్పించే దగ్గర్నుంచి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది ‘ఓం నమో వేంకటేశాయ’. దేవుడు.. భక్తుడు పాచికలు ఆడటం ఇందులో అత్యంత ఆసక్తికర అంశం. హాథీరాం వేంకటేశ్వరుడి కళ్యాణం స్వయంగా జరిపించడం లాంటివి ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి, క్లైమాక్స్ వరకు సినిమా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో మరో ఎత్తుకి వెళ్తుంది.కానీ మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ సినిమా ఫ్లో ని తగ్గించేస్తాయి.

చివరగా అన్నిరకాల సినిమా అభిమానులని, ముఖ్యంగా భక్తి సినిమాలని కోరుకునే వారిని ఓం నమో వెంకటేశాయ సినిమా భక్తి పారవశ్యంలో తీసుకెళ్తుంది, థియేటర్ నుండి ఒక రకమైన భక్తితో బయటికి వస్తారు.

నటీనటుల పనితీరు:

నాగార్జున: గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి వంటి భక్తిరస చిత్రాల్లో నటించి రాటు దేలిపోయిన నాగార్జున ఈ సినిమాలో తన నట విశ్వ రూపాన్నే ప్రదర్శించాడు. సినిమాలో చాలా సన్నివేశాల్లో కేవలం నాగ్ యాక్టింగ్ ఆయా సన్నివేశాలని తారా స్థాయిలో నిలబెట్టడానికి కారణం అయ్యింది అంటే… నాగ్ నటన ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అనుష్క: పరమ భక్తురాలు కృష్ణమ్మ పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. అనుష్క నుండి ఇంత అద్భుతమైన నటన రాబట్టుకున్న ఘనత దర్శకుడికే దక్కుతుంది.

సౌరభ్ జైన్:  వేంకటేశ్వరుని పాత్రలో సౌరభ్ జైన్ సరిగ్గా ఒదిగిపోయాడు. తన నటనతో అందరిని మెప్పించాడు.

రావు రమేష్, ప్ర‌గ్యా జైస్వాల్ త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు.మిగతా నటీ నటులు తమ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • కథ
  • నాగార్జున నటన
  • అనుష్క నటన
  • గోపాల్ రెడ్డి కెమెరా వర్క్
  • ఎడిటింగ్

మైనస్ పాయింట్స్:

  • పాటలు
  • కామెడి ఇరికించిన‌ట్టుండ‌టం
  • అన‌వ‌స‌ర‌మైన క్యారెక్ట‌ర్స్

పంచ్ లైన్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక.. ఈ సినిమా సూపర్ హిట్టయ్యా..!

(Visited 2,403 times, 1 visits today)