Home / Political / అన్ని అత్యవసర పరిస్థితులకు కాల్ చేయవలసిన ఒకే నంబర్ 112

అన్ని అత్యవసర పరిస్థితులకు కాల్ చేయవలసిన ఒకే నంబర్ 112

Author:

trai 112

అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు సహాయక బృందాలకు ఫోన్ చేయడానికి ఉన్న వేరువేరు నంబర్లను క్రమంగా తీసివేసి వాటిస్థానంలో అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్ 112 ఉండాలని ట్రాయి (టెలికం రేగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా) ప్రతిపాదించింది. ప్రస్తుతం అంబులెన్స్ కు, పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి వేరు వేరుగా 100, 101, 102, 108 నంబర్లను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ప్రజలు వారున్న అత్యవసర పరిస్థితుల్లో ఏ నంబర్ కు ఫోన్ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్ 112 ఉండాలని ట్రాయి ప్రతిపాధనను ఇంటర్-మినిస్టెరీల్ పానెల్ టెలికం కమీషన్ ఆమోదించింది. ఇక నుండి ఏ అత్యవసర పరిస్థితి వచ్చిన 112 నంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది. ఈ నంబర్ ఇండియా మొత్తం ఒకే నంబర్ అవ్వడం వలన ప్రజలు ఎలాంటి అయోమయానికి గురికాకుండ సులువుగా 112 నంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది. అయితే పాత నంబర్స్ ని మార్చకుండా పాత నంబర్లకు వచ్చేకాల్స్ ను 112కు మరలిస్తూ ఈ నెంబర్ పై ప్రజలలో అవగాహన కలిగించి పూర్తి స్థాయిలో అమలు జరపాలని కేంద్రానికి సూచించింది.

(Visited 225 times, 1 visits today)