Home / General / బీటెక్‌ తో పాటూ స్పెషల్ కోర్సు చేస్తేనే జాబ్

బీటెక్‌ తో పాటూ స్పెషల్ కోర్సు చేస్తేనే జాబ్

Author:

ఐటీ పరిశ్రమ మన భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి అద్భుతమైన అవకాశాలు సృష్టిస్తోంది. అంతెందుకు ఈ ఐటీ వల్లే మన దేశం లో మధ్యతరగతి వ్యవస్థ పూర్తిగా పోయి అప్పర్ మిడిల్ క్లాస్ అయిపోయింది. ఇవాళ మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలా మంది హాప్పీ గా ఉన్నారంటే ఈ ఐటీ మహత్యమే. పిల్లలు బాగా సెటిలయ్యారని ప్రశాంతంగా రిటైరవుతున్నారు. అయితే ఈ మధ్య రకరకాల రూమర్లు బాగా వస్తున్నాయి. ఐటీ దెబ్బ తింటోందని, ఉద్యోగాల్లో భారీ కోత అని వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజాలేంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

mohandas pai talk about how to get job

ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ ఐటీ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ లోని కొన్ని ముఖ్యాంశాలని ఆయన మాటల్లోనే ‘నిజమే ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల నియామకాల ప్రక్రియలో చాలా మార్పులోచ్చాయ్. చాలా వేగంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న ఇలాంటి పరిస్థితుల్లో జస్ట్ బీటెక్‌ ఉంటే సరిపోదు. కొత్త టెక్నాలజీ ని వెంటనే నేర్చుకుని బాగా అడాప్ట్ అయ్యే వారికే అవకాశాలు ఎక్కువ. కేవలం బీటెక్‌తోనే సరిపెట్టుకోకుండా, ఎంటెక్‌ చేయడంతోపాటు కొత్త టెక్నాలజీ నేర్చుకోండి. కోడింగ్‌ లాంటివి నేర్చుకుని మీలో టాలెంటుకి సాన పెట్టండి. అప్పుడే మంచి జాబ్ కొట్టొచ్చు. ఎందుకంటే, సరైన నైపుణ్యాలు లేని వారిని తీసుకుని వారికి కొన్ని నెలలపాటు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పుడు ఏ కంపెనీ కూడా రెడీగా లేదు. ఇలాంటి ట్రైనింగ్ కోసం డబ్బుని, టైం ని వేస్టు చేయడానికి అవి ఇష్టపడటం లేదు. మీకు కోడింగ్‌ రాయడంలో మంచి నైపుణ్యం ఉంటే సంస్థలు వెంటనే ఉద్యోగం ఇస్తాయి. ఇక ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపుపై వస్తున్న వార్తలన్నీ అభూత కల్పనలే. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ప్రతి ఏడాది సరైన పనితీరు లేని 1-2 శాతం మందిని తొలగించడం సాధారణంగా జరిగేదే. సరిగా పని చేయని వారిని ఎవరు మాత్రం ఉద్యోగంలో ఉంచుకుంటారు. కాబట్టి ఉద్యోగాల కోత వార్తలన్నీ కూతలే తప్ప నిజాలు కావు.

ఇక ఫ్రెషర్స్‌ విషయానికొస్తే, గత కొద్ది కాలంగా ఫ్రెషర్స్‌ జీతాలు పెరగడం లేదు. ఐటీ పరిశ్రమ అనుకున్నంత వేగ౦గా డెవలప్ కాకపోవడమే దీనికి కారణం. గతంలో ఇది 3-4 శాతంగా ఉండే వృద్ధి రేటు, ఈ ఏడాది 2% మాత్రమే అంటే పరిస్థితి ఏంటో అర్థం చేస్కోవచ్చు. దీంతో ఉద్యోగాలు తగ్గాయి, ఉద్యోగార్థుల సంఖ్య పెరగడంతో వేతనాలు పెరగడం లేదు. అంతెందుకు మన దేశంలో ఏడాదికి దాదాపు 10 లక్షల మంది ఇంజినీరింగ్‌ పాసవుతున్నారు. వారిలో 1.5-1.60 లక్షల మందికి ఈ ఏడాది ఉద్యోగం రావొచ్చు.. బీటెక్ చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలంటే ఏ సంస్థా ఇవ్వలేదు. కాబట్టి, బీటెక్ పూర్తి చేసి జాబ్ తప్పకుండా వస్తుంది అనుకునే కుర్ర ఇంజనీర్లు ఒక్కసారి లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకునే ప్రయత్నం చేయండి.

(Visited 874 times, 1 visits today)