Home / health / ఆఫీసు ఒత్తిడిని అయిదు నిముషాలలో జయించండిలా

ఆఫీసు ఒత్తిడిని అయిదు నిముషాలలో జయించండిలా

Author:

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవటం సర్వసాధారణం అయిపోయింది. అన్ని ఒత్తిళ్లు ఒకవైపు అయితే ఆఫీస్ పనుల వచ్చే ఒత్తిడి అంతా, ఇంతా.. కాదు. ఆ ఒత్తిడి వల్ల కూడా పనిపై అస్సలు శ్రద్ధ కలగదు. అటువంటప్పుడు, ఒక అయిదు నిమిషాలు మీకోసం సమయం వెచ్చించి ఒత్తిడిని దూరం చేసుకోవడం వల్ల సమర్థవంతంగా తిరిగి మీ పని హాయిగా చేసుకోవచ్చు.

  • శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. మెడ,భుజాలు, మణికట్టు, చేతివేళ్లు, ముఖ్యంగా వెన్నుపూస తొడ కండరాలు, చీలమండలు స్ట్రెచ్ చేయాలి.
  • గది బయటకు ఒకసారి దృష్టిని మరల్చండి.
  • దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ శ్వాసను ఒక నిముషం పాటు గమనించండి.
  • కాసేపు ఏమీ ఆలోచించకుండా ధ్యానం చేయండి.
  • మీ డెస్క్ ని నచ్చినవిధంగా సర్దండి. సరైన వెలుతురు ఉండేలా చూడండి.
  • ఒక కాగితంపై మీకు నచ్చిన బొమ్మను వేయండి. మంచి పాటను వినండి.

only-five-minutes-to-de-stress

ఇలా చేయడం వల్ల పని వల్ల వచ్చే ఒత్తిడి 5నిమిషాలలో తగ్గి కొత్త ఉత్సాహంతో సమర్థవంతంగా పనిచేయగలుగుతారు.

(Visited 1,094 times, 1 visits today)