Home / Entertainment / ‘ఊపిరి’ పాటల డేట్ వచ్చేసింది.

‘ఊపిరి’ పాటల డేట్ వచ్చేసింది.

Author:

Oopiri Movie

కింగ్ నాగార్జున… ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు తన కొత్త సినిమా అయిన ‘ఊపిరి’ని విడుదలకు సిద్ధం చేసే పనిలో పడిపోయారు. నాగార్జున – కార్తీ ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌‌లో తెరకెక్కిస్తున్న ఈ ప్రయోగాత్మక కామెడీ ఎంటర్‌టైనర్‌ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున జోడీగా శ్రీయ నటిస్తుంది. ‘ఊపిరి’ టీమ్ అన్ని కార్యక్రమాలను చకచకా పూర్తి చేస్తు తాజాగా ఆడియో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. గోపీ సుందర్ అందించిన ఆడియోను ఫిబ్రవరి 28న భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.

తెలుగు, తమిళ లలో ఒకేసారి రిలిజ్ చెయ్యనున్నా ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాలో నాగార్జున పూర్తిగా వీల్ చైర్‌కే అతుక్కుపోయి ఉండే ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే, నాగార్జున, కార్తీ, తమన్నా, అనుష్క, అడివి శేష్.. ఇలా భారీ తారాగణమే కనిపించనున్న ఈ సినిమా సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.

(Visited 83 times, 1 visits today)