Home / Reviews / ఊపిరి సినిమా రివ్యూ & రేటింగ్

ఊపిరి సినిమా రివ్యూ & రేటింగ్

Author:

ఫ్రెంచ్ సినిమా రీమేక్ అందులోనూ మన్మథుడు నాగార్జున సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండిపోవాలి. నాగ్ కార్తీ ల కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇంటచబుల్స్ అనే ఫ్రెంచ్ సినిమా ని తెలుగు నేటివిటీ తో తెరమీదకెక్కించటం తెలుగు సినీ పరిశ్రమ వరకూ ఇది చాలా గొప్ప విషయమే. ప్రేక్షకులని థియేటర్ కి తీసుకురావడంలో ఊపిరి టీం గ్రాండ్ గా విజయవంతం అయింది. మరి థియేటర్ లో కూడా ఆ రేంజ్ సక్సెస్ ని అందుకునే సినిమా చూపించారా? ఇప్పటివరకూ అన్నీ మాస్ యాక్షన్ మూవీస్ చేసిన వంశీ పైడిపల్లి ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ ని కథాంశంగా తీసుకుని వచ్చిన ఊపిరికి సరైన న్యాయం చేసాడా? అసలు ఊపిరి నిజంగా ఊపిరి అందిచ్చినట్టేనా అంటే..!?

Oopiri-Movie-Review

కథ:శ్రీను (కార్తి ) చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓ ఆక్సిడెంట్ లో చనిపోవడంతో తన పిన్ని జయసుద పెంచిపోషిస్తుంది. అప్పటికే జయసుదకు ఇద్దరు పిల్లలు ఉండడం, ఆమె సంపాదన తోనే ఈ ముగ్గురు పిల్లలు పెరుగుతూ వచ్చారు. అదే టైం లో శ్రీను ఎలాగైన ఆమెకు ఏదో విధంగా సాయం చేయాలని భావించి , చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఓ రోజు పోలీసులకు పట్టుపడి జైలుకెళ్తాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీనుని తల్లి (జయసుథ) ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వాడిగా చూపించుకొని కేసునుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తాడు శ్రీను. అందుకోసం అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పని చేయడానికి ప్రయత్నించినా అది కుదరదు. దీంతో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్ టేకర్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూకు వెళతాడు. అక్కడ విక్రమాదిత్య.. సెక్రటరీ కీర్తి(తమన్నా)ని చూసి ఎలాగైనా అక్కడే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు.

విక్రమాదిత్య (నాగార్జున ) ఓ పెద్ద బిజినెస్ మాన్, అంతే కాదు ఇతనికి పెయింటింగ్ అంటే ప్రాణం. మంచి మంచి పెయింటింగ్ లను కొంటు ఉంటాడు..5 ఏళ్ల క్రితం ఓ ఆక్సిడెంట్ వల్ల అతని ఒంట్లోని అవయవాలు ఏమి పనిచేయవు. దీంతో అతడి లైఫ్ అంత ఓ వీల్ చైర్ తోనే సాగిపోతుంది. అదే టైం లో అతడిని చూసుకోవడానికి ఓ వ్యక్తి ని సెలెక్ట్ చేయమని తన అసిస్టెంట్ కీర్తి (తమన్నా ) కు చెపుతాడు. అప్పుడు ఆమె శ్రీను ను సెలెక్ట్ చేస్తుంది.
అప్పటి నుండి విక్రమాదిత్య కు ఏం ఇష్టమో తెలుసుకొని శ్రీను అన్ని చేస్తుంటాడు.ఎలాంటి బాధ్యత తెలియని శ్రీను, విక్రమాదిత్య మనోవేదనను ఎలా పోగొట్టాడు? అదే సమయంలో కీర్తి ప్రేమను గెలుచుకోవడానికి శ్రీను ఎలాంటి ప్రయాత్నాలు చేశాడు..? శ్రీను జీవితంలోని సమస్యలను విక్రమాదిత్య ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ..?

అలజడి విశ్లేషణ: ఇన్‌ట‌చ్‌బుల్ లో ఉన్న పాయింట్‌ని వంశీ పైడి ప‌ల్లి యాజ్ ఇట్ ఈజ్ తీసేశాడు. కొన్ని షాట్స్‌, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ కూడా… అయితే మతృక అయిన ఇన్‌ట‌చ్‌బుల్ చూడ‌నివాళ్ల‌కు ఇదో స‌రికొత్త క‌థ‌గానే క‌నిపిస్తుంది. ఫ్రెంచ్ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి, ఇక్క‌డి భావోద్వేగాల‌కు అనుగుణంగా మ‌ల‌చుకొన్నాడు వంశీ. దాంతో… సినిమాలో ఎక్క‌డా ఫ్రెంచ్ పోక‌డ క‌నిపించ‌దు. మ‌న‌దైన క‌థ చూస్తున్నామ‌న్న భావ‌నే క‌లుగుతుంది. ఎంత బ‌రువైన స‌న్నివేశ‌మైనా. చివ‌ర్లో హ్యూమ‌ర్ ట‌చ్ ఇచ్చి ముగించాడు. దాంతో… ఫ‌స్టాఫ్ ఆహ్లాద‌క‌రంగా ఆనందంగా సాగిపోతోతుంది. దానికి తోడు కార్తి అద‌ర‌గొట్టేశాడు. త‌న క్యారెక్ట‌ర్‌లోనే బోల్డంత హ్యూమ‌ర్ ఉంది. కార్తి క‌నిపించిన ప్ర‌తీ సన్నివేశం పండిందంటే.. అందులో కార్తి ఎంత‌గా ఒదిగిపోయాడో చెప్పొచ్చు. నాగ్, కార్తిల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్ కూడా బాగా చూపించారు. దానికి తోడు.. త‌మ‌న్నా చాలా అందంగా క‌నిపించింది. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ ఎలాంటి బోర్ లేకుండా హాయిగా సాగిపోయింది ఊపిరి ప్ర‌యాణం.
సెకండాఫ్ మాత్రం కాస్త క‌ష్ట‌ పెట్టారు. పారిస్ లో జరిగే ఎపిసోడ్ కాస్త భారంగా న‌డుస్తుంది. అక్క‌డ కొత్త‌గా చూపించిందీ, చెప్పిందీ ఏమీ లేదు.దాదాపుగా రాబోయే ప్రతీ సీన్ నీ మనం ఊహించగలం, కేవ‌లం అనుష్క క్యారెక్ట‌ర్ ఎంట్రీ కోస‌మో. మ‌రి కొంత నిడివిని పొడిగించ‌డానికో ఆ ఎపిసోడ్ ఉప‌యోగ‌ప‌డింది. ప‌తాక స‌న్నివేశాలు కూడా మ‌రీ ఊహ‌కు అంద‌నంత ఇదిగా ఏమీ లేవు. అయితే ఇక్కడ దర్శకుడి తప్పేమీ లేదు మాతృకని అలాగే ఫాలో అయిపోయాడు.దాంతో స‌డ‌న్‌గా సినిమా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ కూడా రావొచ్చు. సెకండాఫ్‌ని భ‌రించి ఫ‌స్టాఫ్‌లోని అనుభూతిని క్యాచ్ చేయగలిగితే ఇన్ టచబుల్స్ అనే ఒక ఫ్రెంచ్ సినిమా డైరెక్టర్ వంశీ ని ఎందుకింతగా వెంటాడిందో అర్థమైపోతుంది..

తెలుగు సినీ రంగంలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని సాహసం చేసిన నాగ్ మరోసారి బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి మాస్ ఎంటర్టైనర్ తరువాత ఊపిరి సినిమా చేసిన నాగ్, తన నమ్మకం వమ్ముకాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాంటి బాడీలాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావాభావాలతోనే అద్భుతమైన ఎమోషన్స్ పండిచాడు. ఇక తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కార్తీ తెలుగబ్బాయే అనేంతగా ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్ రెండు వేరియషన్స్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశాడు. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్, స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంది తమన్నా. నాగార్జున ఫ్రెండ్ గా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో మెప్పించాడు. అలీ, జయసుథ, గ్యాబ్రియల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక అతిథి పాత్రల్లో అలరించిన అనుష్క, శ్రియ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేశారు.
సాంకేతిక వర్గం పని తీరు: ఫ్రెంచ్ సినిమా మన సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా దాన్ని మలచటంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి విజయం సాధించాడు.. ఫ్రెంచి ఇచ్‌టచబుల్స్‌ చిత్రాన్ని ఆదారంగా తెలుగు ప్రేక్షకులకి అర్ధమయ్యే రీతి లో చాల చక్కగా తెరకెక్కించడంలో విజయం సాదించాడు. ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ రాకుండా కామెడీ , లవ్ , సెంటిమెంట్ ఇలా అన్ని కలబోసి నిజంగానే ఊపిరి టైటిల్ కు ఊపిరి పోసాడు. ముఖ్యంగా నాగార్జునను విక్రమాదిత్య పాత్రకు ఒప్పించటమే వంశీ సాధించిన విజయం. ఎక్కడా ఓ రీమేక్ సినిమా చూస్తున్న భావన కలగకుండా అద్భుతమైన ఎమోషన్స్ తో సినిమాను నడిపించాడు. కంటతడి పెట్టించే సెంటిమెంట్ సీన్స్ ఉన్నా.. ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఓ కామెడీ డైలాగ్ తో అలరించాడు. అబ్బూరి రవి అందించిన సంభాషణలు బాగున్నాయి. కామెడీ టైమింగ్ తో పాటు, సెంటిమెంట్ సీన్స్ లో కూడా డైలాగ్ లు ఆకట్టుకున్నాయి
నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. సినిమా అభిమాని. సినిమా బాగా రావడం కోసం ఎంత ఖర్చు పెట్టాడనికైన రెడీ గా ఉంటాడు. ఊపిరి కథ కు తగట్టు సినిమా ని చాల వరకు పారిస్ నగరం లో చిత్రీకరించి సూపర్బ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ అక్కడక్కడ కాస్త ఏదో ఫీల్ కలిగించిన సినిమా మొత్తంగా ఒకే అనిపించాడు పి.ఎస్.వినోద్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ కథ తగిన విధంగా చక్కటి సంగీతం అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు అని చెప్పాలి. అన్ని విభాగాల్లో అందరు న్యాయం చేసారు.

ప్లస్ పాయింట్స్ :

  • నాగార్జున, కార్తీ పెర్ఫార్మెన్స్
  • కథ, కథనం, డైలాగులు
  • ఫోటోగ్రఫీ
  • డైరెక్షన్
  • ఎమోషనల్ సీన్స్

మైన‌స్ పాయింట్స్‌:

  • పాటలు
  • సాగదీసినట్టున్న సెకండ్ హాఫ్

అలజడి రేటింగ్:3.5/5
పంచ్ లైన్: నాగార్జునకి మరో గీతాంజలి

(Visited 3,437 times, 1 visits today)