Home / Inspiring Stories / ఓపెన్ ప్రిడ్జ్ ఆలోచన ఆకలైన పేదవారికి అక్షయపాత్ర అవుతుంది.

ఓపెన్ ప్రిడ్జ్ ఆలోచన ఆకలైన పేదవారికి అక్షయపాత్ర అవుతుంది.

Author:

open fridge for poor people

భారతదేశాన్ని ఒకప్పుడు  పంటలు పండే అన్నపూర్ణగా పిలిచేవారు. కానీ ఇప్పుడు వర్షాలు లేక కరువు దేశంగా మారిపోతుంది. కానీ మన పూర్వీకులు మాత్రం మనకు కొన్ని నీతి సూత్రాలు సూచించారు అందులో అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా ముఖ్యమైనది అని. ఎందుకంటే ఆకలితో ఉన్న వాడికి పిడికెడు అన్నం పెడితే తిన్నవారు చనిపోయేంత వరకు అన్నం పెట్టినవారిని మర్చిపోడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా మంది రాత్రి వండిన అన్నం తెల్లవారు తినడం చాలా అవమానంగా బావిస్తుంటారు. అందుకని మిగిలిన ఆహారన్ని పడేస్తుంటారు. అలాగే మన ఇంట్లో ఏదైన శుభకార్యం జరిగితే చాలా ఆహారం మిగులుతుంది కానీ, మనం ఆ ఆహారాన్ని పక్కన ఉన్న పేదవారికి పంచాలని ఎంతమందికి అనిపిస్తుంది. మన భారతదేశంలో పిడికెడు అన్నానికి చాలా దూరంలో ఆకలి కడుపు మంటలతో ఎంతో చనిపోతున్నారు.

               మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో బాధపడుతున్న అన్నార్తులకు అందించేలా ఓ యువతి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. పబ్లిక్ ఫ్రిజ్ పేరిట కేరళకు చెందిన ఓ యువతి ఆకలిగొన్న పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది. ఇంతకు ఆ యువతి పేరు చెప్పలేదు కదు! ఆమె పేరు మీను పౌలిన్. ఇంతకు ఓపెన్ ప్రిడ్జ్ ముఖ్య ఉద్దేశం మిగిలిన ఆహారన్ని నిలవచేసి పేదవారికి అందుబాటులో ఉంచడం.

                         మీను పౌలిన్ ఇంతకు ముందు బ్యాంక్ ఉద్యోగం చేస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి కేరళలోని కొచ్చిలో ‘పాపడవడ’ పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. కొన్ని రోజులలో తన రెస్టారెంట్ కు మంచి పేరు రావడంతో అక్కడే ఉన్న ఎంజీ రోడ్‌లో మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది.అనుకోకుండ ఓరోజు మీను పౌలిన్ తమ తమ రెస్టారెంట్లలో ఎంతో ఆహారం వృథాగా మిగిలిపోవడం గమనించింది. అంటే ప్రతి రోజు ఇంత ఆహారం మిగులుతుందా! అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు ఎలాగైన ఆ ఆహారాన్ని నిల్వ చేసి పేదవారికి అందించాలి అనుకుంది. అలా అనుకున్న మరుసటి రోజు ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఓ ఫ్రిడ్జ్‌ను ‘పాపడవడ’ రెస్టారెంట్ బయట ఉంచింది. అలా తమ రెస్టారెంట్లలో మిగిలిన ఆహారన్ని తీసుకువచ్చి ఆ ఓపెన్ ఫ్రిజ్ పెట్టడంతో అక్కడ ఉన్న పేదవారు ఎప్పుడైన వచ్చి ఆ ఆహారాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేసింది. నన్మ మరం(గివింగ్ ట్రీ) పేరిట మీను ఏర్పాటు చేసిన ఈ ఫ్రిజ్‌కు స్థానిక నివాసితుల నుంచి కూడా మద్దతు లభించింది. దీనితో స్థానికులు కూడా తమ ఇంట్లో ఉండే ఆహారాన్ని తీసుకువచ్చి ఈ ఫ్రిడ్జ్‌లో అందుబాటులో ఉంచడంతో అక్కడ పేదవారు చాలా సంతోషంగా ఎఫ్ఫుడు ఆకలి అయిన వచ్చి తీసుకొని వెలుతున్నారు.

చూశారా! ఒక మంచి ఆలోచన వల్ల ఎంత మంది పేదవారికి అన్నం దొరుకుతుందో…..

(Visited 594 times, 1 visits today)