Home / Inspiring Stories / ఆపరేషన్ సులేమాన్ పేరుతో పేదవాళ్ల ఆకలి తీరుస్తున్న కలెక్టర్.

ఆపరేషన్ సులేమాన్ పేరుతో పేదవాళ్ల ఆకలి తీరుస్తున్న కలెక్టర్.

Author:

ఈ దేశంలో మామూలు చావుల కంటే ఆకలి చావులు ఎక్కువగా ఉంటాయి. ఆకలిని తట్టుకోలేకనే చాలా మంది పేదవారు కాలే కడుపుతో హోటల్స్ ముందు, టిఫిన్ సెంటర్స్ ముందు నిలబడి ఎప్పుడు ఎవరైనా పిలిచి ఏమైనా ఇస్తారేమో అని ఎదురుచూస్తుంటారు. అలాంటివారిని హోటల్స్ సిబ్బంది దయతలచి ఇంతపెడుతారు, లేకుంటే గెంటివేస్తారు. అలా రోజంతా జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా దయతలచి ఇంత ముద్దా వేస్తె తిన్నట్టు లేకుంటే పస్తులే… అలాంటి వారిని చుస్తే ఎవ్వరికి పట్టింపు ఉండదు…. కానీ ఒక్క ఆయన మాత్రం వారి ఆకలిని చూశాడు, వారి భాదను చూశాడు. అందుకే ఆకలేస్తే ఆడుకోక్కూడ‌దు….ఆలా చేసి పేదవారు అవమానపడకూడదు అనుకున్నాడు ఆ కలెక్టర్. అదే అతని లక్ష్యం… దాని కోసమే ఆయన ప్రవేశపెట్టిన పథకం “ఆపరేషన్ సులేమాన్”.

kozikode-collecter-prashanth-nair-doing-inspiraational-things

కేరళలోని కోజికోడ్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ నాయర్ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ పథకం అందరి మన్నలు పొందుతూ, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. కోజికోడ్ జిల్లాలో ఆకలితో ఎవరు బాధపడకూడదు అన్న లక్ష్యంతో ప్రారంభించారు. ఈ పథకంకింద పేదలందరికీ కొన్ని కూపన్లు ప్రభుత్వం ఇస్తుంది. ఆ కూపన్లను ఉన్నవారు ఏ హోటల్ కి వెళ్లిన భోజనం చేయవచ్చు. ఈ కూపన్ వలన భయపడుతూ హోటల్ ముందు నిలుచున్నా పేదవాడు అదే హోటల్ కి వెళ్లి దర్జాగా భోజనం చేసి వచ్చే సమయంలో ఆ కూపన్ ను బిల్లుగా ఇస్తే సరిపోతుంది. ఈ కూపన్లన్నీ హోటల్ యజమానులు నెలకు ఒక్కసారి క‌లెక్ట‌ర్ ఆఫీసులో ఇస్తే వారికి ప్రభుత్వం ఎంత ఖర్చు అయిందో దానిని బట్టి బిల్లు ఇస్తుంది.ఈ కూపన్లు కోజికోడ్ జిల్లాలో అన్ని హోటల్స్ లలో చెల్లుతాయి. ఈ కూపన్లు చెల్లె హోటల్స్ లలో కూపన్లతో పాటు కొన్ని బాక్సులు కూడా పెట్టారు ఎవరైనా వారికి తోచినంత అందులో వేయవచ్చు.

ఈ విషయం గురించి కలెక్టర్ ప్రశాంత్ నాయర్ మాట్లాడుతూ. ఆకలి తట్టుకోలేక పిడికెడు అన్నం కోసం హోటల్స్ ముందు,క్యూలల్లో నిలబడనవసరం లేదు. ఒక పూట కోసం వారికి ఉన్న పేదరికాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అనేది మన భాద్యత, అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అన్నాడు.

ఇలాంటి క‌లెక్ట‌ర్ రాష్ట్రానికి ఒక్కరు ఉన్న పేదవారికి ఆకలి చవులు ఉండవు. చాలా మంది క‌లెక్ట‌ర్లు రాజాకీయ నాయకులకు తోకాడిస్తూ వారు చెప్పిందే చేస్తుంటారు కాని ఇలాంటి సొంత ఆలోచనలు అమలు చేసే వారు కొద్దీ మంది మాత్రమే ఉంటారు. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్న ప్ర‌శాంత్ నాయ‌ర్‌కు హ్యాట్సాఫ్‌.

(Visited 1,208 times, 1 visits today)