Home / Latest Alajadi / ఈ నెల 28 న భారత్ బంద్..!

ఈ నెల 28 న భారత్ బంద్..!

Author:

నల్ల ధనాన్ని, నకిలీ కరెన్సీ ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలంతా రెండు వారాలుగా కొత్త కరెన్సీ కోసం బ్యాంకుల ముందు, ఏటీఎం, పోస్ట్ ఆఫీస్ ల ముందు లైన్లలో నిలబడుతున్నారు, మోడీ నిర్ణయంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న మోడీ పట్టించుకోవడం లేదని ఈ విషయం పై చర్చ జరిపేందుకు కనీసం పార్లమెంట్ కి కూడా రావట్లేరని విపక్ష నేతలు విమర్శరించారు.

bharath-bandh

ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ఇప్పటి వరకు ర్యాలీలు, మీటింగ్ లతో తమ నిరసనాలని వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు  దేశ వ్యాప్తంగా తమ నిరసనలని చేపట్టాలని నిర్ణయించాయి. ఈ నిరసనలలో భాగంగా భారత్ బంద్ చేయాలనీ నిర్ణయించాయి. ఈ నెల 28వ తేదీ ( సోమవారం ) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి విపక్ష పార్టీలు, ఈ బంద్ కి కాంగ్రెస్ తో సహా అన్ని ప్రధాన ప్రతి పక్ష పార్టీలు మద్దతుని ప్రకటించాయి, నోట్ల రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులని ఎదుర్కుంటున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం నియంతలా వ్యహరిస్తుందని ఆరోపించారు విపక్ష నేతలు, ఈ బంద్ లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలనీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని విపక్ష నేతలు కోరారు.

Must Read: ఆధార్ కార్డు ఉంటే చాలు ఆపరేషన్ చేస్తాం..! కొత్త నోట్లు లేకపోయిన పర్వాలేదు..!

(Visited 1,778 times, 1 visits today)