Home / Political / పాఠాల్లొ ఆ రాష్ట్రం ఉండకూడదు

పాఠాల్లొ ఆ రాష్ట్రం ఉండకూడదు

Author:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డ నాటి నుంచీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ  ప్రతీ విషయంలో విబేధించుకుంటూ వస్తున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు రాష్ట్రాలదీ ఒకటే పంథా. ద్వేషాలను పెంచుకోవటం లో. ప్రజల మద్య పెంచటం లో మాత్రం ఒకె తీరులో వ్యవహరిస్తున్నయి. వివరాల్లోకి వెళితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన చరిత్ర పాఠ్యాంశాలలో ఉండాల్సిన అవసరం లేదనీ ఏవరిదో చరిత్ర మనకెందుకనీ తెరాస ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తెలంగాణ సర్కారు బాటలోనే నడుస్తూ పాఠ్యాంశాలలో తెలంగాణ చరిత్రను తొలగించి తాము కూడ అదే పద్దతిలో ఉంటామని స్పష్టం చేసింది..
                   ఈ మేరకు ఎనిమిదో తరగతిలో ఉన్న నిజాం ఉద్యమ చరిత్ర, తొమ్మిదో తరగతిలో తెలంగాణరాష్ట్రం మాండలిక పాఠాలు, పదవ తరగతి తెలుగులో ఉన్న హైదరాబాద్ నగర వివరాలు, బసవేశ్వర చరిత్ర, అలాగే సోషల్ లో ఉన్న సింగరేణి సమాచారం, ఖనిజాల వివరాలను పాఠ్యాంశాల నుండి తొలగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ప్రశ్నలను పరీక్షలలో అడగబోరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రకమైన తొలగింపు పిల్లకు తమ పక్కనే ఉన్న రాష్ట్రాల స్థితి గతులు తెలియకుండా చేస్తుందనీ ఆ క్రమంలోనే పక్క రాష్ట్రాల ప్రజలంటే ద్వేషం పెరుగుతుందనీ. విధ్యా రంగం లో ఇలాంటి మార్పులు. అభిలష నీయం కాదనీ అంటున్నరు ఇరు రాష్ట్రాల మేధావులు.
(Visited 64 times, 1 visits today)