Home / Entertainment / సంచలనం సృష్టిస్తున్న ‘పచ్చబొట్టేసిన’ వీడియో సాంగ్.

సంచలనం సృష్టిస్తున్న ‘పచ్చబొట్టేసిన’ వీడియో సాంగ్.

Author:

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రాణాలు ప్రధాన పాత్రలో ఒక తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 600 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజువల్ వండర్ గా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అయితే తాజాగా ఈ చిత్రంలో ‘పచ్చబొట్టేసిన పాట’ యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్ తో రికార్డు సృష్టించింది.

ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎక్కువ మంది చూసిన వీడియోగా ఈ వీడియో సాంగ్ సంచలనం సృష్టించింది. ఈ పాటలో తమన్నా, ప్రభాస్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు వ్యతిరేకించారు. సినిమా విడుదల సమయంలో ఈ పాటపై పలువురు మహిళ సంఘాలు, స్వచ్చంద సంస్థలు నిరసనలు తెలిపారు. కాని ఇప్పుడు అదే వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుండటం విశేషం.

(Visited 358 times, 1 visits today)