Home / Political / మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కల్తీ పాలు తాగుతున్నారన్న విషయం మీకు తెలుసా!?

మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కల్తీ పాలు తాగుతున్నారన్న విషయం మీకు తెలుసా!?

Author:

packaged milk polluting

ఉదయం లేచిన వెంటనే ఎవరైనా మీ చిన్నారికి పాలు పట్టిస్తున్నారా? స్వచ్చమైన పాలు అని ధైర్యంగా తాగిస్తున్నారా? లేకా… మీరు పాలు తాగడమో లేక టీ, కాఫీ తాగడమో చేస్తున్నారా!. అయితే ఒక్క క్షణం ఆగండి. తెల్లని పాలలో సైతం నల్లని విషం దాగుంది భారత్ లో ముగ్గురిలో ఇద్దరు కల్తీ పాలను తాగుతున్నారట! ఇందంతా చెపుతున్నది ఎవరో..  కాదు ఆరోగ్య శాఖ మినిష్టర్ హర్షవర్దన్ గారు.

2011లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ పాల ప్యాకింగ్ మీద చేసిన సర్వేలో చాలా వరకు కలుషితం అయినట్టు తెలిసింది. ఇంకా ఈ సర్వేలో చాలా మంది సొంతంగా ప్యాకింగ్ చేయడం వలనే కలుషితం అవుతున్నట్టు తెలిసింది. అలాగే పాలు శుద్ది చేసే కర్మాగారలలో సర్ఫ్(Detergents) లాంటి వాటిని ఉపయోగించడం వలన పాలు నిల్వ ఉండే సామాగ్రీలు శుభ్రంగా ఉండటం లేవని ఈ సర్వేలో పేర్కొన్నారు. పాలు, నీళ్ళతో కల్తీ చేస్తే ఫర్వాలేదు కానీ, యూరియా, హైడ్రోజన్ ఫెరాక్సైడ్‌, స్టార్చ్, గ్లూకోజ్ మరియు ఫార్మాలిన్తో లాంటి పదార్ధాలతో పాలను కల్తి చేసి వాటిని సరఫరా చేస్తున్నారు. ఇలా మొత్తం 28రాష్ట్రాల మరియు 5కేంద్రపాలిత ప్రాంతాల నుండి 2011లో దాదాపు 70% నమూనాలు కల్తీ చేయబడ్డాయని తెలిసింది. అలాగే 1791 నమూనాలలో చాలా పలుచని పాలు ఉన్నట్టు, ఇంకా 8% డిటర్జెంట్ కలిపారని ఈ సర్వేలో తెలియజేయడం జరిగింది.

ఈ కల్తీ పాలు తాగడం  వలన గుండె సమస్యలు , క్యాన్సర్ వంటి రోగాలే కాకుండ అనేక వైఖల్యాలతో పాటు చనిపోయే ప్రమాదం ఉన్నట్టు, అలాగే ఈ కల్తీ పాలు తాగితే వెంటనే దాని రియాక్షన్ ఉంటుందని, అలాగే దీని రియాక్షన్ దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు ఈ సర్వేలో తేలిందని మంత్రి తెలియజేశాడు. ఈ కల్తీని అరికట్టడానికి రాజస్థాన్ లో ‘పిలని’ అనే పట్టణంలో ఒక కొత్తరకమైన స్కానర్ ను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాజస్థాన్ పూర్తిగా ఇండియన్ టెక్నాలజీ తో తయారుజేశారు . దీని ద్వారా 40సెకండ్లలో కల్తీ చేయబడిన పాలని గుర్తించవచ్చనీ, అలాగే రానున్న రోజుల్లో GPS ఆధారిత టెక్నాలజీ తో కల్తీ జరుగుతున్న ప్రాంతాలని గుర్తించి, ఈ కల్తీ ని పూర్తిగా అరికట్టవచ్చని మంత్రి తెలియజేయడం జరిగింది.

(Visited 990 times, 1 visits today)