Home / Inspiring Stories / పద్మ అవార్డులు అపహాస్యం ఔతున్నాయా..?

పద్మ అవార్డులు అపహాస్యం ఔతున్నాయా..?

Author:

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పద్మ అవార్డుల ఎంపిక వివాదాస్పదం కానుందా. 2016 సంవత్సరానికి గానూ ఎంపిక చేసిన పేర్ల జాబితాలో లొసుగులున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పద్మ అవార్డుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిన పేర్లలో రామోజీ రావు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. మొత్తం 30 మందితో కూడిన జాబితాను ఏపీ ప్రధాన కార్యదర్శి కృష్ణా రావు కేంద్రానికి పంపారు. ఐతే తన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల తప్ప సినిమా నటుడిగానూ, నిర్మాత గానూ మురళీ మోహన్ పెద్దగా చేసిందేమీ లేదు. అలాగే ఈనాడు సంస్థల అధినేత అయిన రామోజీ రావు కూడా సమాజానికి లేదా కళారంగానికీ గొప్పగా ఏం చేసారని ఆయనకి పద్మ అవార్డ్ కోసం
సిఫారసు చేయటం వెనక రాజకీయ కారణాలు తప్ప ఏమీ లేవనీ అసలు తమ వ్యక్తిగత, పార్టీ వ్యవహారాలలో తమకు అనుకూలం గా ఉన్నవారి పేర్లు మాత్రమే సిఫారసు చేస్తున్నారనీ పలువురు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు ఈ మధ్య కాలంలో ఆరోగ్య శ్రీ పథకం దుర్వినియోగం కేసులో వినిపించిన స్టార్ హాస్పిటల్ అధినేత మన్నెం గోపీ చంద్ తో పాటు గా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన ముప్పై మంది జాబితాలో నటుడు రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సోమరాజు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ చంద్రశేఖర్ సింహాద్రి ల పేర్లను కూడా పద్మా అవార్డులకు సిఫార్సు ఇదివరలో కూడా గాయకుడు బాలసుబ్రమణ్యం వంటి వారు తెలుగు వారే అయినప్పటికీ తమిళనాడు నుంచి సిఫారసు చేయబడ్డారు. అవార్డుల విషయంలో లాబీయింగ్ వల్ల అర్హుల పేర్లు వెనుక బడి కేవలం అధికార పక్షాలకు అనుకూలంగా ఉన్నవారికే అవారడులను కట్టబెడుతున్నారంటూ ఒక పత్రిక ఇప్పటికే తెలుగు దేశం ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసింది. పద్మ అవార్డుల విశయం పోయినేడాది నుంచీ వివాదాలలోనే ఉంది. సినీ నటులు మోహన్ బాబూ, బ్రహ్మానందం ల కు ప్రధానం చేయబడిన పద్మా అవార్డులను అగౌరవపరిచారనే కారణంతో వెనక్కు తీసుకున్నప్పుడు కూడా అసలు ఎవరికి అవార్డులు ఇస్తున్నారో వాటిని నిజంగా  అర్హులకే ఇస్తున్నారా అనే విషయంలో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది… అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల కోసం ఎంపిక చేసేటప్పుడు తమ,పర భేదాలు చూడకూదదనీ పలువురు అభిప్రాయ పడుతున్నారు అంటూ ఒక స్థానిక పత్రిక లో వచ్చిన కథనం కలకలం రేపుతోంది… ఇప్పటికే ముప్పై మంది అవార్డు నామినేషన్ లు పరిశీలనలో ఉన్నాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పద్మ సిఫార్సులను చూసి తుది జాబితాను నవంబర్ లో ప్రకటిస్తారు.

(Visited 124 times, 1 visits today)