Home / health / పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Author:

కాంబిఫ్లేమ్ ఉపయోగించే వాళ్ళూ తస్మాత్ జాగ్రత్త! 2018 మే, జూన్‌ ఎక్స్‌పెయిరీ డేట్ ఉన్న కాంబిఫ్లేమ్ ట్యాబ్లెట్లు నాసిరకంగా ఉన్నాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) పరీక్షల్లో తేలింది. వీటిని ఉపయోగించినవారి శరీరంలో ఇవి కరగడానికి పరిమితికి మించిన సమయం పడుతోందని వెల్లడైంది. ఇలా పరిమితికి మించి ఎక్కువ సమయం పట్టడం వల్ల శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖా తెలిపింది, ఈ ట్యాబ్లెట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని స్పష్టంగా తేలింది. 2015 జూన్, 2015 జూలై నెలల్లో తయారైన ట్యాబ్లెట్లు నాసిరకంగా ఉన్నాయని సీడీఎస్‌సీఓ విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.

painkiller-combiflam-runs-into-trouble-some-batches-withdrawn

కాంబిఫ్లేమ్‌లో పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ ఉంటాయి. దీనిని వాడినవారి శరీరంలో ఇది కరగడానికి పట్టే సమయాన్నిబట్టి వీటి ప్రమాణాలను నిర్ధారిస్తారు. ఈ ట్యాబ్లెట్లను ఫ్రెంచ్ కంపెనీ సనోఫీ ఉత్పత్తి చేస్తోంది. సీడీఎస్‌సీఓ నివేదిక పర్యవసానంగా భారతదేశంలోని సనోఫీ స్థానిక విభాగం ఈ ట్యాబ్లెట్లను భారీగా వెనక్కు రప్పిస్తోంది. మన దేశంలో సనోఫీ విక్రయిస్తున్న ఐదు అతి పెద్ద బ్రాండ్లలో కాంబిఫ్లేమ్ ఒకటి.

Must Read:ఫోన్ ఉంటే చాలు ఇవన్నీ ఉచితమే…!

Source: Andhrajyothi.com

(Visited 8,544 times, 1 visits today)