Home / Inspiring Stories / మన ఇరు దేశాల మధ్య అపోహని పెంచుతుందెవరు?

మన ఇరు దేశాల మధ్య అపోహని పెంచుతుందెవరు?

Author:

Pakistani_Commando

“మతం” ప్రపంచం లో ఇప్పుడు నెలకొన్న అసాధారణ పరిస్థితులకు కారణం అన్న అపవాదుని ఎదుర్కుంటున్న ఒకే ఒక్క పదం. భారత దేశం లోనూ మిగిలిన ప్రపంచదేశాలలో నూ కొందరు విపరీత ధోరణుల మనుషుల వల్ల ముస్లిం దేశాలు ఎదుర్కునే ధారుణ వివక్ష మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మీద మనకున్న అపోహలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మనదేశం పై వారికీ ఎన్నో అనుమానాలూ భయాలూ ఉన్నాయి. భారత దేశం లో ఉన్నవారందరికీ పాకిస్థాన్ అంటే కోపం అక్కడి ముస్లిం లని వాళ్ళు భాదపెడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడి హిందువుల జీవితాల మీద మనం ఆందోళన పడుతున్నాం ఐతే నిజానికి రాజకీయ కారణాలు తప్ప సామాన్య జీవనం లో మరీ అంత వ్యత్యాసం లేదనిపిస్తుంది..

సిక్కుల గురువైన నానక్ గా పిలవబడక ముందు ‘రాయ్-భోయి-డి-తల్వాండి’ గా పిలవబడిన జన్మస్థలం నేటి పాకిస్థాన్ లోనే ఉంది. లాహోర్ కి నైరుతిలో 80 కిలోమీటర్ల దూరం లో ఉన్న నన్కానా అనే స్థలాన్ని సిక్కులు పరమ పవిత్ర స్థలం గా భావిస్తారు. 547 వ జన్మదిన సందర్భంగా మూడు రోజుల పండుగ పాల్గొనేందుకు ఒక ప్రత్యేక రైల్లో పాకిస్తాన్ చేరుకున్న భారతీయ సిక్కులకి అక్కడ కనిపించిన దృశ్యం ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగించింది. “ముస్లింలు తమ స్త్రీ లని భురఖాల్లో బందించేస్తారు, వారిని అసలు బయట స్వతంత్రంగా తిరగనివ్వరూ పాకిస్థాన్ లో స్త్రీ లకు స్వేచ్చలేదూ” అనే వార్తలు విని అదే నిజం అనుకున్న వాళ్లకి. చేతిలో మిషన్ గన్ పట్టుకొని విధులు నిర్వహిస్తున్న లేడీ ఆఫీసర్ ని చూసి వాళ్ళు షాక్ అయ్యారట. అంతే కాదు పాక్ లో ఉన్న చాలా సంస్త ల్లో పని చేస్తూ రోడ్ల మీద స్వేచ్చగా తిరుగుతున్న స్త్రీలని చూసాక నాకు ఈ వరల్ద్ మీడియా పై విపరీతమైన కోపం వచ్చింది” అంటూ తన సోషల్ మీడియా వాల్ మీద అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ఫొటో తీసిన స్మిత దీపక్.

రాజకీయ, మత పర తేడాలు ఎన్ని ఉన్నప్పటికీ తమ దేశం వచ్చిన యాత్రీకుల భద్రత కోసం ప్రతీదేశం ఆలోచించి తీరుతుంది. అది భారతదేశం కావొచ్చూ, పాకిస్తాన్ కావొచ్చు. ఒక దేశం గురించిన చెడునే తప్ప పౌరుల మధ్య ఉండే అపోహలని తొలగించటానికి కృషి చేయని మీడియా దేశాల మధ్య విద్వేషాలు పెరుగు తున్న ఈ విశయం లో నైతిక భాద్యత వహించక తప్పదు. స్త్రీ స్వేచ్చ విశయం పై ఒక మాటకు వస్తే మనదేశం లోనే ఒక మహిళా సెక్యూరిటీ అధికారి ఒక మిషన్ గన్ తో నిలబడగా మనం చూడగలగటం ఇప్పటికైతే అరుదైన సంఘటనే..

(Visited 158 times, 1 visits today)