Home / Inspiring Stories / తప్పుడు తయారీ తేదీలతో ప్రజలని మోసం చేస్తున్న రాందేవ్ బాబా.

తప్పుడు తయారీ తేదీలతో ప్రజలని మోసం చేస్తున్న రాందేవ్ బాబా.

Author:

pathanjali noodels

రాం దేవ్ బాబా నూడుల్స్ పతంజలి ప్రోడక్ట్స్ అన్నిటిలోకెల్లా అత్యంత మార్కెట్ చేసుకున్న ప్రోడక్ట్. మ్యాగీ నూడుల్స్ కి పోటీ గా పతంజలి సంస్థ విడుదల చేసిన ఈ నూడుల్స్ లో పురుగులుంటున్నాయనీ,వాటిలో నాణ్యత లోపించిందనీ వచ్చిన విమర్శలనటుంచితే..అసలు పతంజలి సంస్థ ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెట్టబడిన గోధుమ పిండి నూడుల్స్ కి అసలు అనుమతులే ఇవ్వలేదని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ అధ్యక్షుడు అశిష్ బహుగుణ స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటి ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోకుండానే రాందేవ్ బాబా నూడుల్స్ మార్కెట్ లోకి విడుదల చేశారని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు అన్నారు. అసలే మాత్రం నాణ్యత లేని ప్రోడక్ట్స్ వస్తున్నాయని ఎన్ని ఆరోపణలు వచ్చీ అన్నిటినీ ఎదుర్కుంటూ. నిరాటంకంగా తన ప్రోడక్ట్లని మార్కెట్ చేసేస్తున్నారు రాం దేవ్ బాబా…

వివాదాల పతంజలి ఆహార ఉత్పత్తుల సంస్థ ఇప్పుడు ఇంకో వివాదంలో చిక్కుకుంది. ఈ మధ్యనే ఈ ఆహార ఉత్పత్తుల మీద తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని ఉత్పత్తుల మీద ఉన్న తయారీ, వాడక ముగింపు తేదీ(ఎక్స్పైరీ డేట్)లు చూసి అవాక్కయ్యారు. పతంజలి ఆంలా మురబ్బా(ఉసిరి కాయ మురబ్బా) 1 కిలో ప్యాక్ మీద తయారీ తేదీ అక్టోబర్ 20, 2016 గా ఉండటం ఎక్స్పైరీ(గడువు) తేదీ 19 అక్టోబర్ 2017 గా ఉంది.సదరు అక్టోబర్ 20 రావటానికి ఇంకా 8 నెలల సమయం ఉంది. అంటే నిజానికి 2017 ఫిబ్రవరి కల్లా ఆ పదార్థం పాడైపోతుంది. కానీ పతంజలి సంస్థ వేసిన తేదీలని నమ్మి వాడితే అది తిన్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో భాదపడే అవకాశం ఉంది.

సంస్కారీ భారత్,ఆరోగ్య భారత్ అంటూ ఉపన్యాసాలిచ్చే రాం దేవ్ బాబా సొంత సంస్థ లోనే ఇలాంటి అక్రమాలు జరుగుతూంటే… ఇక సామాన్యుడు ఎవరిని నమ్మగలడు?

(Visited 4,477 times, 1 visits today)