Home / Inspiring Stories / మళ్ళీ గర్జించనున్న పఠాన్ కోట్ సింహం.

మళ్ళీ గర్జించనున్న పఠాన్ కోట్ సింహం.

Author:

Patankot

శైలేష్ గౌర్ గుర్తున్నాడా ..!? జనవరి 1,2 తేదీల్లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడిలో గాయపడ్డ 24 ఏళ్ళ ఈ యువకిశోరం మళ్ళీ తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు సిద్దమయ్యాడు. సింహం మళ్ళీ గర్జిస్తూ బరిలోకి దిగనుంది….

జనవరి 2వ తేదీ, తెల్లవారుజాము 3 గంటల సమయంలో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చేరిన ఉగ్రవాదులు మెకానికల్‌ ట్రాన్స్ పోర్ట్ బేస్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాయుస్థావరంలో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉన్న ప్రాంతం లోకి వెళ్ళి అక్కడ విద్వంసం సృష్టించాలి. అయితే వారు మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ బేస్ దగ్గర ఉన్నప్పుడే వారిని మట్టుబెట్టేందుకు 12 మంది గరుడ కమెండోలు రంగంలోకి దిగారు. ముందుగా ఇద్దరిద్దరు మూడు బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులను కదలకుండా నిలువరించారు. మరో 3 బృందాలు వెనక నుంచి కాల్పులు ప్రారంభించాయి. ముందు వరుసలో ఉన్న కమెండో గురుసేవక్‌ సింగ్‌, ఓ వింగ్‌ కమాండర్ ముందుగా దాడి ప్రారంభించారు. వారి వెనుక నుంచి కమెండోలు శైలేష్ గౌర్, కేతల్‌లు కాల్పులు ప్రారంభించారు. గురుసేవక్ దేహంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి అయినా కాల్పులు ఆపలేదు. చివరికి ఆయన నేలకొరగడంతో శైలేష్, కేతల్‌లు తమ దాడికొనసాగిస్తూ ముందుకు వెళ్ళారు. అదేక్రమంలో శైలేష్ పొత్తికడుపు ప్రాంతంలో ఆరు బుల్లెట్లు దిగబడ్డాయి. అంత బాధలోను తీవ్ర రక్తస్రావం అవుతున్నపటికీ శైలేష్ గౌర్ ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వారిని అక్కడే నిలువరించగలిగాడు. ఈలోగా అక్కడికి అదనపు భద్రతాదళాలు వీరికి సహాయంగా చేరుకున్నాయి. దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు మెకానికల్ ట్రాన్సుపోర్ట్ ఏరియా నుంచి వెనక్కి పారిపోయారు. ఈ వీరోచిత ఎదురుదాడి కారణంగానే ఉగ్రవాదులు వాయుస్థావరంలో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉన్న కీలక ప్రాంతంలో అడుగు పెట్టలేకపోయారు. వాళ్లు అక్కడికి వెళ్లి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేది…

శైలేష్ ని మిలటరీ హాస్పిటల్ కి తరలించి ఆపరెషన్ లో అతని శరీరం లో దిగబడిన ఆరు తూటాలనూ బయటికి తీసిన వైధ్యులు అతని ప్రాణాలపై అప్పుడే ఏమీ చెప్పలేం అన్నారు. నెలరోజులకు పైగా మిలిటరీ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకున్నాడు శైలేష్ గౌర్. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగు పడింది. పూర్తి ఆరోగ్యంతో అతను కోలుకున్నాడని ప్రకటించారు డాక్టర్లు. ప్రమాదం జరిగినప్పుడు అతని శరీరం నుంచి 3 లీటర్ల రక్తం పోయింది అంటే దాదాపు మరణం అంచులకి చేరుకున్నాడు, అన్ని బుల్లెట్లు దిగినా ఇంకా స్పృహలోనే ఉండి పోరాడిన అతన్ని చూసి ఎంతో అనుభవం ఉన్న మిలటరీ డాక్టర్లే ఆశ్చర్య పోయారట. ఫిబ్రవరి 17 న ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ లో మెడికల్ పరీక్షల కోసం హాజరవ్వాల్సిందిగా అతనికి ఆదేశాలందాయి. అక్కడ మెడికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అతని ఫిట్నెస్ నిరూపించ బడితే ఆరెండోరోజునుంచే అతను విధుల్లో చేరవచ్చు….

చిన్న తనంలో తాను చూసిన “కమాండో” “రాంబో” వంటి హాలీవుడ్ సినిమాల్లోని హీరో క్యారెక్టర్ల ఇన్స్పిరేషన్ వల్లే తాను ఈ రంగంలోకి రాగలిగాననీ, తనలోని పోరాట స్పూర్తికి తన 2010 లో ఎయిర్ ఫోర్స్ లో సెలెక్టయిన శైలేష్ తన అత్యుత్తమ ప్రతిభతో అందరి మన్ననలూ పొందటమే కదు. పఠాన్ కోట్ ఘటన లో తాను చూపిన అసామాన్య తెగువకూ భారత దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. శైలేష్ ఇకముందు కూడా మన దేశ రక్షణలో ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం….

(Visited 968 times, 1 visits today)