అంతర్జాతీయ నిర్మాణాలు, విదేశీ కంపెనీలు, ప్రపంచస్థాయి రాజధాని… ఇలాంటి మాటలు ఏ రియల్ ఎస్టేట్ సంస్థ చెబుతుంటే ప్రజలు విన్నా అదివారి వ్యాపార ప్రకటనలే అనుకుంటారు. అయితే ఇక్కడ ఈ మాటలన్నీ చెప్పింది సాక్షాత్తూ ప్రభుత్వం. అందుకే జనం రకరకాలుగా అయోమయానికి గురవుతున్నారు. ఎపి ప్రభుత్వం చేస్తున్న ఇష్టారాజ్య ప్రకటనలకు, అది చేస్తున్న అస్తవ్యస్త ఆలోచనలకు విజయవాడలో మెట్రో రైలు ఒక ఉదాహరణ. విజయవాడ సమీపంలోనే రాజధాని అనుకోగానే మెట్రో రైలు కావాల్సిందేనని చంద్రబాబు ఎలా భావించారు? హైదరాబాద్ ను అభివృద్ది చేసాను అన్నట్టుగా విజయవాడ లో మెట్రో రైల్ వాత పెట్టుకున్నారనుకోవాలే తప్ప ఈ ఆలోచన ఎందుకు చేసారో తెలీదు . ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉండి, దాదాపు కోటి జనాభా, అందులో సగం సంఖ్యలో జనం రాకపోకలు సాగించిన హైదరాబాద్ ట్రాఫిక్ తో పోల్చుకుంటే విజయవాడ లో ఉన్న జనాభా ఎంతా? అక్కడ ఉండబోయే సంస్యలెలాంటివి, రోడ్లు వెడల్పు చేయకుండానే అప్పుడే మెట్రో రైలు ఎందుకు ఇలా సామాన్యుడికి వచ్చిన ఆలోచనలు కూడా ప్రభుత్వానికి రాలేదా? విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో కొన్నేళ్లుగా ఉక్కిరిబిక్కిరి అయి ఒకటికి నాలుగు ఫ్లై ఓవర్లు, ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు. ఇవన్నీ అయిపోయాక ఇక వేరే మార్గం కనబడక మెట్రో రైలు తప్పనిసరయింది హైదరాబాద్ కు. అలాంటి హైదరాబాద్ అనుభవాన్ని చూసి కూడా… విజయవాడకు ఇప్పటికిప్పడు మెట్రో రైలు కావాలని బాబు యోచించడం విచిత్రం. దీని కోసం ఇప్పటికే కొన్నిసార్లు మెట్రో రైలు రూపకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు.
రాజధానిగా విజయవాడకు దగ్గర అనగానే ఈట్ పరిశ్రమంతా విజయవాడ కు తరలి వచ్చేస్తుందని చంద్రబాబు ఊహించారా.? లేకపోతే మెట్రొ నగరానికుండాల్సిన అర్హతలేమిటో ప్రభుత్వాధికారులు మర్చిపోయార? లేక రియల్ బూమ్ ని పెంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనుకోవాలా? ఇప్పటిదాకా మెట్రోరైలు అంటూ జనాన్ని ఊరించి, విజయవాడ జనం చెవుల్లో మరొక పువ్వును జత చేసిన ప్రభుత్వం… కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించిన దరిమిలా వారికి ఏం సమాధానం చెబుతుంది? తను కడుతున్న మిగతావన్నీ గాలి మేడలు కాబోవనే విషయంలో జనానికి ఎటువంటి హామీ ఇస్తుంది? అని ఆంద్ర ప్రదేశ్ ప్రజలు బాహాటంగానే అంటున్నారు రాష్ట్ర విభజనతో నిస్పృహలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఏ చిన్న ఆశ కనిపించినా చాలనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారున్న పరిస్థితిలో వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడం ఎంత అవసరమో. వారిని అయోమయానికి గురిచేసి అసహనాన్ని పెంచకుండా ఉండడం అంతకుమించిన అవసరం. ప్రజల మేలు కోరాల్సిన ప్రభుత్వాలు ఇకనైనా ప్రజలను వంచించే ప్రయత్నాలు మానేస్తే మేలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.