Home / Entertainment / అభిమాని కోసం సినిమాని నిర్మిస్తున్న పవన్, త్రివిక్రమ్.

అభిమాని కోసం సినిమాని నిర్మిస్తున్న పవన్, త్రివిక్రమ్.

Author:

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరు మంచి స్నేహితులని తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. దానికి కారణం వారి అభిరుచులు కలవడం. ఈ ఇద్దరు కలసి వారి అభిమాని కోసం ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరికీ హీరో నితిన్ అంటే ప్రత్యేక అభిమానం. ఇక పవన్ అంటే నితిన్ కి చెప్పలేని అభిమానం. త్రివిక్రమ్, నితిన్ ల కలయికలో ‘అఆ’ సినిమా వచ్చి నితిన్ కెరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.’అఆ’ సినిమా సమయం నుండే త్రివిక్రమ్, నితిన్ ల మధ్య అభిమానం పెరిగి అది కాస్త మంచి స్నేహంగా మారింది.

pavan producing movie for nitin

ఇక ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా మన ముందుకు వస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని పవన్, త్రివిక్రమ్ నిర్మిస్తున్నారు. వీరితో పాటు నితిన్ తండ్రి సుధాకర్ కూడా మరో నిర్మాతగా ఉన్నాడు . పవన్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే చాలా రోజుల తరవాత త్రివిక్రమ్ బయటివారికి కథను అందించడం ఈ సినిమాకి జరుగుతుంది. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం జరుపుకుంది. తోలి సన్నివేశానికి పవన్ క్లాప్ కొట్టగా, త్రివిక్రం కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే షూటింగు జరుపుకోనున్న ఈ సినిమాకు హీరోయిన్, ఇతర సాంకేతిక వర్గాలని త్వరలోనే ప్రకటించనున్నారు.

(Visited 39 times, 1 visits today)