Home / Entertainment / పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఒకే ఫ్రేం లో!?

పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఒకే ఫ్రేం లో!?

Author:

Pawan-Kalyan-and-Chiranjeevi-in-gabbar-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజ చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది.. ఇటివలే గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకొని, హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసారు. మొన్న రిలీజ్ డేట్, నిన్న 2 కోట్ల సెట్, ఈరోజు మెగా స్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు అనే వార్త మీడియా లో జోరుగా ప్రచారం అవుతుంది..దీంతో ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు..ఏంటి నిజమా..? లేక ఎవరైన కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారా అనేది తెలియక అయోమయం లో పడిపోయారు..

వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నాడు అనే వార్తలు ప్రచారం జరిగాయి..కానీ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఒకే ఫ్రేం లో కనిపించబోతున్నారు అనే వార్త మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. మెగా స్టార్ పేరు బయటకు రావడం తో ఇది నమ్మలా వద్ద అనేది తెలియడం లేదు..

(Visited 89 times, 1 visits today)