Home / Entertainment / సర్ధార్ కోసం పవర్ స్టార్ పైట్స్.

సర్ధార్ కోసం పవర్ స్టార్ పైట్స్.

Author:

సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ sardaar gabber singh teaser

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా ఇటీవలే గుజరాత్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కి అన్ని కార్యక్రమాలను సిద్దం చేసుకుంటోంది ఈ చిత్ర టీం.

ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన శరత్ మరార్ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకొనే కేర్ గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తేలియజేశాడు. సినిమాకు సంబంధించి నాలుగు మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ ను పవన్ స్వయంగా డిజైన్ చేసినట్టు సమాచారం. ఇందులో ఇప్పటికే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుపుకోగా మిగతా రెండింటి కోసం రామ్-లక్ష్మణ్ లను గైడ్ చేస్తున్నారట పవన్. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ తెలియజేశారు. అలాగే పాటల షూట్ కోసం మచి లోకేషన్స్ చూసే బాధ్యత కూడా పవన్ తీసుకున్నారట. సినిమాలో సహాయక పాత్రల్లో సహజత్వం కనిపించడానికి నటీ-నటులకు కూడా పవన్ సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

పవన్ అంతకు ముందు కూడా తమ్ముడు, జానీ, గుడుంబ శంకర్, సినిమాలకు తనే యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసిన విషయం తేలిసిందే, సినిమా ఎలా ఉన్న పవర్ స్టార్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అద్బుతంగా ఉంటాయనే విషయం మనకు తేలిసిందే. ఇక ఎలాంటి యక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో తేలుసుకోవలంటే మాత్రం సినిమా రీలిజ్ వరకు అగవలసిందే….

(Visited 44 times, 1 visits today)