Home / Entertainment / పవన్ కళ్యాన్ పై అభిమానం అంతా ఇంతా కాదు.

పవన్ కళ్యాన్ పై అభిమానం అంతా ఇంతా కాదు.

Author:

ఒకప్పుడు పవన్ కళ్యాన్ అంటే మెగాస్టార్ కి తమ్ముడు, మంచి నటుడు అనే అభిప్రాయం మాత్రమే ఉండేది అయితే తన నటనతోనే కాదు ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల,ఆయన భిన్నమైన మనస్తత్వం వల్ల అభిమానులకు మరింత చేరువయ్యాడు. పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలు కూడా పవన్ స్టామినాతో హిట్ టాక్ తెచ్చుకున్న రోజులున్నాయి. ఇండస్ట్రీ లోనే ఒక యునిక్ గుర్తింపు ఉన్న పవన్ తన అభిమానులనే కాదు…ఎప్పుడో తప్ప సినిమాలు చూడని వారిని కూడా ఆకట్టుకున్నాడు.పవన్ పవరేంటో చూపించాడు. అటు జన సేన నేతగా ఇటు సినీ హీరో గా తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న పవన్ అంటే అతని అభిమానులు చూపించే ప్రేమ మామూలుగా ఉండటం లేదు….

Pawan Kalyan Craze 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా రోజు రోజుకి పీక్ స్టేజ్‌కి వెళ్తుంది. పవన్ ఫోటోలు, ఆయన సినిమా పోస్టర్‌లు ఇన్నాళ్లు ఆటోలు, బస్సులు , మొబైల్స్ వాల్ పేపర్ల వరకు మాత్రమే పరిమితమై ఉండేది. కాని ప్రస్తుతం పవన్ ఫోటోలు వెడ్డింగ్ కార్డ్స్‌పై కూడా ప్రత్యక్షమవుతున్నాయి. సెల్ ఫోన్ కవర్ల మీద ఎన్నడూ లేని విధంగా సర్దార్ గబ్బర్ సింగ్ ఫొటోలు వుంటున్నాయి.. అయితే ఇదే పిచ్చి ఇంకా ముదురి పాకాన పడిడింది.

Pawan Kalyan Craze

ఇటీవల పవన్ అభిమాని ఒకరు వివాహం చేసుకోగా, ఆయన పెళ్ళి బ్యానర్‌పై ఏకంగా సర్ధార్ గబ్బర్ సింగ్ ఫోటో పెట్టేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కాని పెళ్ళిలో పెళ్లి కూతురు తప్ప మ్యారేజ్‌కు హాజరైన కొందరు పవన్ స్టైల్లో ఎరుపు రంగు రుమాలుతో ఫోటోలకు ఫోజులివ్వడంతో అందరు షాకయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సర్ధార్ చిత్రం రిలీజ్ తర్వాత పవన్ క్రేజ్ ఇంకే రేంజ్‌లో పెరుగుతుందో చూడాలి..

(Visited 669 times, 1 visits today)