Home / Entertainment / నా చెల్లి పెళ్లి పవన్ కళ్యాణ్ సహాయం వల్లనే చేశా – సత్యానంద్

నా చెల్లి పెళ్లి పవన్ కళ్యాణ్ సహాయం వల్లనే చేశా – సత్యానంద్

Author:

మాములుగా ఒక శిల్పి ఏం చేస్తాడు ఒక రూపంలేని వస్తువుకు ఒక చక్కటి రూపాన్ని అందించి ఆ వస్తువుకు ప్రాణం పోస్తాడు. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే శిల్పి మాత్రం ఒక మాములు మనుషులను తన నట శిక్షనతో వారిని స్టార్స్ చేస్తున్నాడు. అతనే లంక సత్యానంద్. అరే పేరు ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా! అదేనండి మన వైజాక్ సత్యనంద్ గారు.

మన తెలుగు హీరొలలో ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్స్ సత్య తయారు చేసి వదిలిన బాణాలే ఇప్పుడు టాలివుడ్ లో చక్రం తిప్పుతున్నారు.
సత్యనంద్ గారి దగ్గర శిక్షణ పొందినవారిలో మొట్ట మొదటి విద్యార్థే పవర్‌స్టార్‌ అయ్యారు. అవును ఇది నిజం. అలాగే సత్యానంద్‌ శిక్షణాలయం అఫీషియల్‌గా మొదలైన తర్వాత వచ్చిన విధ్యర్థి ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు, అతనే మన మహేష్ బాబు.వీరి తర్వాత సత్యనంద్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఒకరి తర్వాత ఒకరికి శిక్షణ ఇస్తూ చాలా మందిని మన టాలివుడ్ కి పరిచయం చేశాడు వారిలో ముఖ్యంగా ప్రభాస్‌, రవితేజ, సాయిరామ్‌శంకర్‌, శర్వానంద్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌, ఆది.. తదితరులు ఉన్నారు. ప్రస్తుతం సీనియర్‌ నటుడు నరేష్‌ వాళ్ల అబ్బాయి, మరో రాజకీయ నాయకుడి కుమారుడు, ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అబ్బాయికి శిక్షణనిస్తున్నాడు.

మరి ఇదంత ఒక వైపు మాత్రమే సత్యనంద్ శిక్షణాలయం పెట్టక ముందు చాలా ఏళ్ళు నాటకాల పై ప్రేమతో చాలా నాటకాలు వేశాడు అలాగే దర్శకత్వం కూడా వహించాడు. రంగస్థల దిగ్గజాలు అత్తిలి కృష్ణారావు, చాట్ల శ్రీరాములు, జేవీ రమణమూర్తి, సోమయాజులు వంటి ప్రముఖుల సహచర్యంతో నటుడిగా ఎన్నో నేర్చుకున్నాడు. 1975లో ‘కళాజ్యోత్స్న’ అనే నాటక సంస్థను ప్రారంభించి 15 నాటకాలు, 60 నాటికలు ప్రదర్శించాడు. 72 నాటికలకు సెట్‌ డిజైనర్‌గా పనిచేసి. ఉత్తమ దర్శకుడిగా, నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న. తను చప్పట్లు, ప్రశంసలు తప్ప చిల్లిగవ్వ సంపాదించలేదు.. అప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి మెల్లిగా వచ్చాయి సత్య గారికి.  సిని గురువుగారు అయిన జంధ్యాల గారు సత్యా గారి  నా నాటకం ‘మల్లెపందిరి’ చూసి సినిమాల్లో పనిచేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఆ తర్వాత మంచుపల్లకి, శ్రీమతి కావాలి, చైతన్యం, కళ్లు, కలికాలం, ఆడది చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి. రెండు సినిమాల్లో నటించాడు కూడా.

ఇంత చేసిన చేతిలో డబ్బులు లేకూండ ఉన్న రోజులలో సత్య గారి  పెళ్ళి జరిగింది. భార్య శాంతాదేవి ఒక స్కూల్‌ టీచర్‌. ఆమె జీతం తెచ్చి బీరువాలో పెడితే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేవాడట! అలా ఒకరోజు ఆ బీరువాకి తాళం ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! ఇదే విషయాన్ని తన భార్యని అడిగితే తన డబ్బులు ఖర్చు చేయడానికి వీల్లేదని, సంపాదింంచి ఖర్చు చేసుకో అని తెగేసి చెప్పిందట!. అప్పటివరకు ఉచితంగా నాటకాలు వేసిన సత్య గారు ఆపై డబ్బులు తీసుకోవడం ప్రారంభించాను అంటాడు. అలా అనుకొకుండ ఒక రోజు చిరంజీవి గారు పిలిచి పవన్ కళ్యాణ్ గారికి నటనలో శిక్షణ ఇవ్వమనడంతో సత్యాగారి జీవితం టర్న్ అయ్యిందని చేబుతాడు.

pawan kalyan helped satyanand

ఇంత జరిగిన ఒక సమయంలో సత్యా గారు చాలా కష్టపడిన చేతిలో డబ్బులు లేని రోజుల్లో అనుకొకుండా తన చెల్లి పెళ్ళి పెట్టుకొవడంతో డబ్బులు చాలా అవసరం అయిన సమయంలో పవన్‌ ఫోన్‌ చేశారట!. మాటల్లో పెళ్లి ప్రస్తావన వచ్చి విషయం తెలుసుకున్న ఆయన వెంటనే సత్యను హైదరాబాద్‌కు రమ్మని  చేతిలో రూ.50 వేలు పెట్టి పంపించాడట!. ఆ తర్వాత పెళ్లికి వెళ్ళి మరికొంత డబ్బిచ్చాడట!. వెళ్తూ వెళ్తూ ఓ బ్యాగ్‌ చేతికిచ్చి అందులో డబ్బులున్నాయని.. కావాలంటే తీసుకొమ్మని చెప్పారట! పవన్‌. ఆ సహకారంతోనే నా చెల్లి పెళ్లి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయగలిగాను అంటున్నారు సత్యా గారు.

(Visited 1,321 times, 1 visits today)