Home / Entertainment / డబ్బు సంపాదన కాదు ప్రజల అభిమానం ముఖ్యం.

డబ్బు సంపాదన కాదు ప్రజల అభిమానం ముఖ్యం.

Author:

pawan kalyan

ప్రతి ఏడాది ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తదితరుల సంపాదన వివరాలు ప్రకటించి టాప్ ఎవరు వారి సంపాదన ఎంత అనేది ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే..ఈ 2015 ఏడాది కి గాను ఆ లిస్టును విడుదల చేసింది.. ఈ టాప్ 100 లిస్టులో ఈ సారి ఎక్కువ మంది మన టాలీవుడ్ సెలబ్రిటీలు చోటు దక్కడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ టాప్ ప్లేస్ లో నిలవగా తెలుగు లో మహేష్ టాప్ లో ఉన్నాడు.

తెలుగులో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్, రాజమౌళి, కాజల్, రవితేజ, ప్రభాస్, అల్లు అర్జున్, శృతి హాసన్ వంటి వారికీ చోటు దక్కి ఫ్యాన్స్ దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్ కు చోటు దక్కక పోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది. అయితే ఇక్కడ సంపాదనకు తగ్గట్టే ఖర్చు కూడా ఉన్న విషయం మర్చిపోవద్దు. పవన్ ఎక్కడ విపత్తులు జరిగిన ఏదైన ప్రమాదం జరిగిన లేద ఎవరైన ఆపదలో ఉన్న తనకు తెలిస్తే ఊరుకునే మనస్థత్వం కాదు. అంతకు ముందు పార్టీ పెట్టి తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. పార్టి పెట్టి అందరు సంపాదించుకున్నారే తప్ప ఎవ్వరు అప్పులు చేయ్యలేదు ఒక్క పవర్ స్టార్ తప్ప.. తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం, తన గురించి తను తక్కువ ఆలోచుకుంటు ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి పవర్ స్టార్. తనకు ఏమైన సోంత ఆస్తీ ఉందంటే ప్రజల ప్రేమాభిమానాలే నిజమైన వ్యక్తి కి అవి ఉంటే చాలు అందుకే పవర్ స్టార్ నిజమైన వ్యక్తి. ఫోర్బ్స్ మేగజైన్ లో డబ్బులు సంపాదించే వారు ఉంటారు, ప్రేమాభిమానాలు సంపాదించే వారు గుండెల్లో ఉంటారు. అందుకే పవర్ స్టార్ అభిమానుల గుండెల్లో ఊంటాడు,పవర్ స్టార్ గుండెల్లో అభిమానులు ఊంటారు. ఇదే పవనిజం అంటే ….

(Visited 315 times, 1 visits today)