Home / Latest Alajadi / పవన్ సభ…. ప్యాకేజి కోసమా! లేక హోదా కోసమా !

పవన్ సభ…. ప్యాకేజి కోసమా! లేక హోదా కోసమా !

Author:

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని  పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పెద్ద సభలు  ఏమి జరుపలేదు. ఇప్పుడు ఏ.పీ ప్రత్యేక హోదా డిమాండ్ తో మొదటి సారి కాకినాడ జేఎన్టీయూ లో ఈ రోజు సాయంత్రం తన గొంతు  విపించనున్నాడు.

pawan-kalyan-speech-kakinada

ఎలక్షన్ టైం లో ఎన్డీయే తో మిత్ర పక్షంగా ఉండి యిప్పుడు దానికి వ్యాతిరేకంగా మాట్లాడతాడా! లేదా! అని అందరూ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక  హోదాపై ప్రెస్ మీట్ పెట్టి చాలా సార్లు వాదించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో  కేంద్ర ప్రభుత్వం ఏ.పీ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి వారికి చిన్నపాటి ప్యాకేజీని ప్రకటించింది. దీనితో సభలో  పవన కళ్యాణ్ ప్యాకేజి గురించి మాట్లాడతాడా! లేక హోదా కావాలని మాట్లాడుతాడా ! అనే దానిపై ఏ.పీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. జనసేన సభలలో అన్ని రాజకీయ సభలకు బిన్నంగా వేదికపై ఒక్కడే నిలబడి మాట్లాడటం చేస్తుంటాడు పవన్. ఈ సభలో కూడా అదే విధంగా చేయనున్నట్లు తెలుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావాలంటే ఇప్పుడు ఉద్యమం చేయాలి, కానీ వారికి కెసిఆర్ లాగ దిశా నిర్దేశం చేసి ముందుండి నడిపించే నాయకులూ లేరు, అందరి శాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదనే ఉన్నాయి, ఈరోజు జరిగే సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాని సాధించడానికి తన కార్యాచరణని ప్రకటిస్తాడా..? లేక ఎప్పటిలాగే వేచిచూసే ధోరణినే ఎంచుకుంటాడా అనేది తెలిసిపోతుంది.

ఈ రోజు జరుగబోయే జనసేన సభకు పవన్ అభిమానులతోపాటు, వారి పార్టీ సభ్యులు, విద్యార్థులు, కొంత మేధావి వర్గం కూడా హాజరు కానున్నారు. ఈ  సభ మొదలు అవడానికి ముందు అభిమానులు బైక్ ర్యాలీలు వంటి చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీస్  వర్గాలు. సభ ప్రాంగణంలో మొత్తం 1000 మంది పోలీసులు బందో బస్తులో పాలుగొంటున్నారు . సభ జరిగే స్టేడియం సామర్థ్యం లక్ష మాత్రమే కానీ ఈ సభకు దాదాపు 2లక్షల వరకు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయి.

(Visited 431 times, 1 visits today)