Home / Entertainment / టాలీవుడ్ లో చరిత్ర సృష్టించనున్న పవన్ కళ్యాణ్?

టాలీవుడ్ లో చరిత్ర సృష్టించనున్న పవన్ కళ్యాణ్?

Author:

pawan_kalyan_sardaar_gabbar_singh

పవన్ కళ్యాణ్ హిస్టరి క్రియేట్ చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. సీక్వెల్ సినిమా బాలీవుడ్, కోలివుడ్, మాలీవుడ్, ఆఖరికి శాండల్ వుడ్ లో కూడా అచ్చొచ్చిన మన టాలీవుడ్ లో మాత్రం అచ్చిరాలేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మనీ కి సీక్వెల్ గా మొదట వచ్చిన మనీ మనీ ఫ్లాఫ్ అయిన విషయం మనకు తెలిసిందే, ఈ సీక్వెల్స్ అప్పటి నుండి మొదలు మొన్న వచ్చిన కిక్ 2 వరకు నిర్విరామంగా ఫ్లాప్ లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక సినిమాకు సీక్వెల్ తీయడం అంటే మాములు విషయం కాదు, అందులో బ్లాక్ బ్లాస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ పవర్ స్టార్ ఇవి ఏమీ పట్టించుకొకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వేల్గా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కథ మీదా పవన్ కున్న నమ్మకమే ఈ సినిమా ను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టి తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తుందని తెలుగు సినిమా వర్గాలు లెక్కలు కడుతున్నారు.

(Visited 1,173 times, 1 visits today)