Home / Entertainment / కమెడియన్ సినిమా ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్

కమెడియన్ సినిమా ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్

Author:

టాలీవుడ్ లోనీ హీరోలు కూడా ఆరాధించే హీరో పవన్ కళ్యాణ్. ఎక్కడైనా కష్టపడేవారు ఉంటే వారిని కచ్చితంగా ఎంకరేజ్ చేస్తాడు. పవర్ స్టార్ నీ చాలా మంది హీరోలు వారి ఆడియో ఫంక్షన్స్ కి ప్రేమతో పిలుస్తారు. తనకు వీలుంటే కచ్చితంగా వస్తాడు వీలు కాలేదంటే పిలిచినా హీరోలే అర్ధం చేసుకుంటారు. పవన్ ఇంతకు ముందు బయట వారి ఫంక్షన్ కి మొదటి సారివచ్చింది నితిన్ సినిమాకి తరువాత కొన్ని మెగా సినిమాలకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఒక కమెడియన్ చిత్ర పాటల వేడుకకు రానున్నాడు. ఆ కమెడియన్ కి పవన్ అంటే ప్రాణం అందుకే తన కోసం షూటింగ్ కూడా వదిలిపెట్టి రానున్నాడు.

sapthagiri-express-audio-launch-by-pawan_telugu

పరుగు సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన సప్తగిరి ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అంతగా పేరు రాలేదు. ప్రేమకధాచిత్రం సినిమాతో ఒక్కసారిగా స్టార్ కమెడియన్ అయిపోయాడు. దానితో సప్తగిరి విరామం లేకుండా సినిమాలు చేసి ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోని మొదటిసారిగా హీరోగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ నవంబర్ 6 న జరుగనుంది. రూ. 6 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తుండగా, డా. రవికిరణ్ నిర్మిస్తున్నాడు.

(Visited 140 times, 1 visits today)