Home / Entertainment / రానున్న రెండు సంవత్సరాలలో వీలైనన్ని సినిమాలు చేయనున్న పవన్ కళ్యాణ్.

రానున్న రెండు సంవత్సరాలలో వీలైనన్ని సినిమాలు చేయనున్న పవన్ కళ్యాణ్.

Author:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనుకున్న విజయం సాధించలేదు దానితో వెంటనే మరో చిత్రాన్ని మొదలు పెట్టాడు అదే ‘కాటమరాయుడు’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అజిత్, తమన్నా జంటగా నటించిన తమిళ సినిమాని రీమేక్. ఈ సినిమాను రచయిత ఆకుల శివ మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మలిచాడని షూటింగ్ మొదలైన రోజే తెలియాజేశారు చిత్ర యూనిట్. కాటమరాయుడు అనంతరం పవన్ తన చిరకాల మిత్రుడు త్రివిక్రంతో ‘దేవుడే దిగి వచ్చిన’ సినిమా చేయనున్నాడు. వచ్చే ఎన్నికలలోపు తక్కువలో తక్కువ ఒక నాలుగు సినిమాలు అయిన చేయాలని పవన్ అనుకుంటున్నట్టు అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.

pawan-movies

పవన్ ఒకవైపు రాజకీయాలను మరొక వైపు సినిమాలను సమానంగా చేస్తూ వస్తున్నాడు. వచ్చే ఎన్నికలలో ప్రత్యక్షంగా నిలబడతాడు కాబట్టి అప్పుడు ఇంత సమయం ఉండకపోవచ్చు అందుకే వచ్చే ఎన్నికల ముందే ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నారట!. ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు చిత్రాన్ని సర్దార్ గబ్బర్ సింగ్  చిత్రాన్ని నిర్మించిన తన స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

(Visited 156 times, 1 visits today)