Home / Entertainment / “కాటమరాయుడు” గా పవర్ స్టార్.

“కాటమరాయుడు” గా పవర్ స్టార్.

Author:

పవర్ స్టార్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. తదుపరి చిత్రంగా యస్.జె సూర్య దర్శకత్వంలో ఒక సినిమా మొదలైన విషయం తెలిసిందే కానీ సూర్యకు మహేష్ బాబు సినిమాలో విలన్ గా అవకాశం రావడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. దానితో పవర్ స్టార్ తో గోపాల గోపాల సినిమా తీసిన దర్శకుడు డాలి, సూర్య స్థానంలోకి వచ్చాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక పవన్ ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

katama rayuda logo

పవన్ తన తదుపరి సినిమాలో యాక్షన్ & లవ్ స్టోరీ ఉంటుందని ఇదివరకే ప్రకటించారు. తదుపరి సినిమాకు వివిద పేర్లు  బయటకి వచ్చాయి. కొందరు కడప కింగ్ అని కొందరు రాయలసీమ పులి అని ఇలా ఎవరికీ వచ్చినట్టు వారు పేర్లు పెట్టేశారు కానీ ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్…. పవన్ పుటిన రోజు సందర్భంగా ఈ సినిమా పేరు ప్రకటించాడు అదే ‘కాటమరాయుడు’. అత్తారింటికి దారేదిలో పవన్ పాడిన పాటలోని మొదటి అక్షరాలను ఈ సినిమాకు పేరు పెట్టడం విశేషం. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో తనకు జోడి కట్టిన  శృతిహాసన్ ని  హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాడు పవన్.

(Visited 144 times, 1 visits today)