Home / Entertainment / దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకున్న చిన్న సినిమా.

దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకున్న చిన్న సినిమా.

Author:

ఒకే ఒక్క సినిమా ఎంతో మంది జీవితాలు మార్చింది. ఇప్పుడు ఒక్కరు కుడా ఖాళీగాలేనంత బిజీలో ఉన్నారు. అదే సినిమా జీవితం అంటే. మంచి కథ, కథనం తోడైతే ఎంత చిన్న సినిమా అయిన కోట్లు సంపాదిస్తుందనడానికి పెళ్ళిచూపులు సినిమానె సాక్ష్యం.

pelli-chupulu-movie-50days

ఈ సినిమా కేవలం కోటి మీద ఖర్చుపెట్టి తెరకెక్కించి దాదాపు 20 కోట్లకు పైననే వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ఈ సినిమా ఇప్పుడు 50 రోజులు పూర్తీ చేసుకుంది . పెద్ద హీరోల సినిమా వారం ఆడటమే గొప్ప అయినా ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా ఇన్ని రోజులు ఆడటం సినిమా పరిశ్రమలో చాలా మందికి మింగుడు పడటం లేదు. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారే. అవకాశం కోసం ఆఫీకి వెళ్తే చీదరించుకున్నవారే నేడు వారి డేట్స్ అడుగుతున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, విజయ్ దేవర కొండకు మాత్రం ఇది రెండవ సినిమా, రీతూ వర్మ, హీరో ఫ్రెండ్ కౌశిక్ అనే పాత్రలో నటించిన ప్రియదర్శి, విష్ణు… పెళ్ళిచూపులు తర్వాత తెలుగు సినిమాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.

(Visited 73 times, 1 visits today)