Home / General / తాళికట్టే ముందు వరుడికి ఆ వధువు ఏం షరతు పెట్టిందో తెలుసా.? దెబ్బకి పెళ్ళికి వచ్చిన వారంతా.!

తాళికట్టే ముందు వరుడికి ఆ వధువు ఏం షరతు పెట్టిందో తెలుసా.? దెబ్బకి పెళ్ళికి వచ్చిన వారంతా.!

Author:

ఆమె పేరు పూనమ్, ఆమెది హర్యానా రాష్ట్రంలోని బిలావల్ అనే గ్రామం…. వాళ్ళ నాన్న ఓ గవర్నమెంట్ టీచర్. మరికొన్ని రోజుల్లో సందీప్ కుమార్ అనే వ్యక్తి తో ఆమె పెళ్లి కానుంది. అయితే అక్కడి సాంప్రదాయం ప్రకారం అబ్బాయిలే భరణం కింద అమ్మాయిలకు కట్నం ఇచ్చే ఆచారం ఉంది. సో అమ్మాయి తరఫు బంధువులు, అబ్బాయి తరఫు బంధువులు కూర్చొని దాని విషయమై మాట్లాడుకుంటున్నారు. అమ్మాయికి మేం బంగారం చేయిస్తాం…అవి, ఇవి అంటూ లిస్ట్ రాసుకుంటున్నారు అబ్బాయి తల్లీదండ్రులు.

అప్పటి వరకు కామ్ గా ఉన్న ఆ అమ్మాయి…మీ అబ్బాయి నా మెడలో మూడు ముళ్లు వేయకన్నా ముందే ఓ పని చేయాలంటూ షరతు పెట్టింది ఆ అమ్మాయి. ఏంటా షరతు అంటూ అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు అబ్బాయి తరఫు బంధువులు

అప్పుడు పూనమ్….” మీరు నా మెడలో తాళి కట్టే కంటే ముందే ఓ 11 మంది బాలికల చదువు బాధ్యత మీరు వహించాలి. మీ నుండి నాకు చిల్లిగవ్వా వద్దు..నాకేదైతే ఇవ్వాలనుకుంటున్నారో…అదంతా ఓ 11 మంది నిస్సహుయులైన బాలికల పేరు మీద డిపాజిట్ చేయండి, దాని మీద వచ్చే వడ్డే డబ్బులతో వాళ్ల చదువులు సక్రమంగా సాగేలా చూస్తానన్న హమీ ఇస్తే చాలు…నేను సంతోషంగా తలొంచి మీతో తాళి కట్టించుకుంటా” అని చెప్పింది.

source

అమ్మాయిలు చదువుకోకపోవడం వల్లే దేశం వెనుకపడిపోతోందని అమె బలంగా నమ్ముతుంది. ఓ టీచర్ కూతురుగా ఈ విషయాలపై అమెకు గట్టి పట్టుకూడా ఉంది. అందుకే పెళ్లికి ముందు భర్తకు ఈ కండీషన్ పెట్టింది. ఒంటి నిండా ఆభరణాలు కావాలి? లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలలో జమ చేయాలని ఆలోచించే ఈ రోజుల్లో పూనమ్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి.

(Visited 1 times, 1 visits today)