Home / Inspiring Stories / తనను కాపాడిన మనిషి కోసం 8 వేల కి.మీ. ప్రయాణిస్తున్న పక్షి.

తనను కాపాడిన మనిషి కోసం 8 వేల కి.మీ. ప్రయాణిస్తున్న పక్షి.

Author:

PENGUIN-BRAZIL

సహాయం చేసిన వారు మరిచిపోయిన, సహాయం పొందిన వారు వారిని జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఇలాంటి సంఘటన మనుషుల మధ్య జరిగితే వింతేముంది అనుకోవచ్చు కానీ, ఒక పక్షి మనిషి చేసిన సహాయానికి 8000 వేల కి.మి. దూరం నుండి వచ్చి తనకు సహాయం చేసిన వక్తితో 11 నెలల పాటు వుండి తిరిగి 8000వేల కి.మీ. వెళ్లిపోతుంది. అది ఎలాంటి పక్షి..? ఎక్కడ జరుగుతుంది ఇదంతా అనేకదా..! మీ డౌట్, ఆ పక్షి పేరు పెంగ్విన్. ఆ పక్షిని కాపడింది బ్రెజిల్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు జొహావో పీరా డిసౌజా.

తాపి మేస్త్రీ అయిన డిసౌజా అపుడప్పుడు చేపల వేటకు వెళ్ళేవాడు. అలా 2011లో ఒకనాడు చేపల వేటకు వెళ్లినప్పుడు సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని ఆకలితో బాధ పడుతున్న పెంగ్విన్ పక్షిని చూసిన డిసౌజా దానిని ఇంటిని తీసుకెల్లి, దాని రెక్కలకంటిన చమురును పూర్తిగా తొలగించేందుకు డిసౌజాకు వారం రోజులు పట్టిందట. తర్వాత మరో వారం రోజులపాటు పూర్తిగా కోలుకునే వరకు తనతోనే ఉంచుకొని తర్వాత దాన్ని తీసుకొచ్చి సముద్ర తీరాన వదిలిపెడితే వెళ్లిపోయిందని, మళ్లీ కనిపించదని అని కూడా అనుకున్నాడట! కొన్ని నెలల తర్వాత మరోసారి సముద్ర తీరానికి చేపల వేటకు వచ్చినప్పుడు ఆ పెంగ్విన్ పక్షి తన కోసం నిరీక్షిస్తూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడట డిసౌజా. తన ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఆహారంగా రోజు చేపలు తీసుకొచ్చి పెట్టేవాడినని, అలా తమ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిందంట!తన వద్దకు వచ్చి ఒళ్లో కూర్చుంటుందని, తన ముక్కుతో ముఖమంతా తడుముతూ తన ప్రేమను చాటుకుంటుందట… తనపై ఇంత అభిమానం ఉండటానికి కారణం తనను కాపాడినందుకే కావొచ్చు అంటూ… ఆ పక్షికి ముద్దుగా ‘డిండిమ్’ అని పేరు కూడా పెట్టుకున్నట్టు తెలియజేశాడు డిసౌజా.

penguin human relation

అయిన ఒక పక్షి తనను కాపాడినందుకు 8000 కి.మీ. ప్రయాణించి బ్రెజిల్ వచ్చి ఆ వక్తి వద్ద 11 నెలలు వుండి తన ప్రేమను పంచి తిరిగి వెల్లీపోతుంది అంటే ఇదే నిజమైన ఆప్యాయత అంటే…

(Visited 3,892 times, 1 visits today)