Home / Inspiring Stories / ఎన్ని సార్లు హెచ్చరించిన మారని 12345 పాస్‌వర్డ్

ఎన్ని సార్లు హెచ్చరించిన మారని 12345 పాస్‌వర్డ్

Author:

12345 అనేవి కేవలం అంకెలు కాదు కొన్ని లక్షల ఆన్‌లైన్ అకౌంట్ ల పాస్‌వర్డ్ కూడా. సెక్యూరిటీ సంస్థలు ఎన్ని సార్లు హెచ్చరించిన ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది తమ వివిద అకౌంట్ లకు పెట్టుకునే పాస్‌వర్డ్ మాత్రం 1234, 12345, 123456 సీరీస్ లోనే ఉందని ఒక సర్వే లో తేలింది. మనం ఎదైన  ఎకౌంట్ల కి పాస్ వర్డ్ ఎందుకు పెట్టుకుంటాం? మన అకౌంట్ ని ఇంకెవరు ఉపయోగించకుండ ఉండటానికి, కానీ చాలా మంది సింపుల్ పాస్‌వర్డ్ లు పెట్టుకొని హ్యాకర్ల భారిన పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 12345 అనేది దేనికైన కామన్  పాస్ వర్డ్ అయ్యింది.

worst passwords

ముఖ్యంగా ఎందుకు ఈ పాస్ వర్డ్ ఎంచుకుంటున్నారు  అంటే సులభంగా గుర్తుకు ఉంటుందని. కానీ దాని వలన ఎర్పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక బ్యాంకింగ్, ఆన్ లైన్, డెబిట్, క్రెడిట్ కార్డ్ కి కూడా చాలామంది ఇదే పాస్ వర్డ్ వాడుతున్నారు. ఈ మధ్య హ్యాకర్లు   3.2 కోట్లమంది ట్విట్టర్ ఎకౌంట్లను హ్యాక్ చేశారు. అందులో 12345 సీరీస్ పాస్‌వర్డ్ ఉన్న అకౌంట్లు లక్ష పైననే ఉన్నాయని సమాచారం.

ఇంకొంతమంది వారి లవర్ పేరు, 12345, 123456789, qwerty, password, abcd వంటి పదాలను పాస్‌వర్డ్  గా పెట్టుకుంటున్నారని సర్వే లో తేలింది. ప్రతిఒక్కరూ తమ పాస్‌వర్డ్ విషయంలో తగు జాగ్రత చర్యలు తీసుకోవాలి లేకుంటే భారి ముల్యం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా మారి మీ సింపుల్ పాస్‌వర్డ్ ని కొంచెం మార్చి ఎవ్వరికీ తెలియని పాస్‌వర్డ్ పెట్టుకోండి.

(Visited 2,178 times, 1 visits today)