Home / Inspiring Stories / 76ఏళ్ళ వయసు..ఒక కాలు లేదు అయినా అతని ఆత్మవిశ్వాసం కోల్పోలేదు

76ఏళ్ళ వయసు..ఒక కాలు లేదు అయినా అతని ఆత్మవిశ్వాసం కోల్పోలేదు

Author:

జీవితం చాలా నేర్పిస్తుంది ముఖ్యంగా మనకు మనం గా ఎలా బతకాలో నేర్చుకోవటానికి మన కాలిబర్ ని తెలుసుకుని ఆత్మ విశ్వాసం తో బతకటానికి కావాల్సిన ఉదాహరణలని ప్రతీ రోజూ ఏదో ఒక మనిషి రూపం లోనో లేదంటే సంఘటన లాగానో మనకు చూపిస్తూనే ఉంటుంది….
70 ఏళ్ళ వయసులో ఒక కాలు కోల్పోయిన వృద్దుడు ఏం చేయగలడు? మహా అయితే అడుక్కుంటాడు తనకెవరూ లేరని కుమిలిపోతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు జ్వరం వస్తేనే ఎవరూలేరని భాద పడే మనం ఈ వృద్దున్ని చూసి ఏం నేర్చుకోగలం..? వరుణ్ అనే వ్యక్తి సోషల్ ఎక్స్పరిమెట్లలో భాగంగా కొన్ని వీడియోలని తీస్తూంటాడు.కొందరికి డబ్బు సహాయం కూడా చేస్తూంటాడు. అందులో భాగంగానే రోడ్డుపక్కన బరువు చూసే యంత్రాన్ని పెట్టుకొని కూచున్న ముసలాయన దగ్గరికి వెళ్ళిన వరుణ్ అతన్ని చూసి మీ కాలు పోయింది కదా మరి మీరు ఇంకా పని చేస్తున్నారు ఎప్పుడూ నిరాశ పడలేదా ఈ వయసులో నేను పని చేయటం ఏమిటని మీరనుకోలేదా? అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం. “శరీరాన్ని పని చేయించాలి వీలైనంత వరకూ మీరు నిరాశపడొద్దు ఓటమిని ఒప్పుకోవద్దు” అంటూ చెప్పిన సమాధానం మనలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని మరోసారి తట్టి లేపుతుంది. 50 రూపాయల లోపే అతని రోజువారీ సంపాదన కనీసం ఒక రోజు పూర్తి కడుపునింపటానికి కూడా సరిపోని సంపాదన. అయినా అతని ఆత్మ విశ్వాసం సడలలేదు.
బరువు చూసుకున్న వరుణ్ 65 కిలోలకి గానూ ఒక్కొక్క కిలోకి 100రూపాయల చొప్పున 6500 ఇవ్వబోయాడు కానీ ఆ వృద్దుడు కనీసం ఆడబ్బుని ముట్టుకోలేదు.ఆయన చెప్పిన మాటలేమిటంటే…. “నేను బతికున్నంత వరకూ నేను ఇలా వచ్చిన డబ్బుని తీసుకోను ఎవరిదగ్గరా డబ్బుని ఆశించను నాకీ డబ్బు వద్దు.నాకు భగవంతుని మీద విశ్వాసం ఉంది, ఒక రోజు ఒక మనిషి నా యంత్రాన్ని పగలగొట్టాడు దాన్ని రిపేరు చేయించే డబ్బు కూడా నాదగ్గర లేదు కానీ రెండోరోజు మిషన్ తనంతట తానే పనిచేసింది దేవుడు నన్ను ఎప్పుడూ  ఓడిపోనివ్వడు” అంటూ ఆ పెద్దాయన చెప్పిన మాటలు. నిజానికి మన కు జీవితం అంటే ఏమిటో చెప్తాయి. ఆయనకి సలాం చెప్తూ మనలో స్పూర్థి నింపే ఆ వ్యక్తిని ఎప్పుడూ ఇలాగే చూడమని ఆభగవంతున్ని వేడుకుంటూ అలజడి.కాం

(Visited 526 times, 1 visits today)