Home / Latest Alajadi / పెట్రోల్‌ ధర రూ.100 మర్క్ వైపు పరుగులు

పెట్రోల్‌ ధర రూ.100 మర్క్ వైపు పరుగులు

Author:

ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల గుండెలు గుబేల్‌మంటున్నాయి. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు మంగళవారం కూడా మరింత పైపైకి చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఇప్పటికే రూ. 90ని దాటిన పెట్రోల్‌ రూ. 100 మార్క్‌వైపు వేగంగా పరుగులు పెడుతోంది. నేడు మరో 14పైసలు పెరగడంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.22కు చేరింది.

మరో వారం రోజులు ఇలాగే పెరిగితే పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టడం ఖాయంగానే కన్పిస్తోంది.దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.86గా ఉంది. కోల్‌కతాలో రూ. 84.68, చెన్నైలో రూ. 86.13, హైదరాబాద్‌లో రూ. 87.84గా ఉంది. ఇక డీజిల్‌ కూడా నేడు 10పైసలు పెరిగి దిల్లీలో లీటర్‌ ధర రూ. 74.12కు చేరింది. ముంబయిలో రూ. 78.69, కోల్‌కతాలో రూ. 75.97, చెన్నైలో రూ. 78.36, హైదరాబాద్‌లో రూ. 80.62గా ఉంది.

petrol-price-crosses-rs-90-per-litre-mark-sep-25-2018

పెట్రోల్ రేట్లు పెరుగుతూ పోతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ధరలను నియంత్రించకుంటే త్వరలోనే లీటర్ పెట్రోల్ వందకు చేరుకునే అవకాశముందంటున్నారు.

(Visited 1 times, 1 visits today)