Home / Inspiring Stories / రైల్వే స్టేషన్ లో కూలీ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పీజీ, ఎం.ఫిల్ విద్యార్థులు.

రైల్వే స్టేషన్ లో కూలీ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పీజీ, ఎం.ఫిల్ విద్యార్థులు.

Author:

మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక్క ఇంజినీరింగ్ విద్యార్థులే మూడు లక్షల  మంది విద్యార్థులు బయటికి వస్తున్నారు అంటే మిగతా కోర్స్ చేసే విద్యార్థులు  ఎంత మంది ఉంటారో ఆలోచించండి…. అలాగే మన రాష్ట్రంలోనే ఇంత మంది ఉంటే మిగతా రాష్ట్రాలలో ఎంత మంది విద్యార్థులు   ఉంటారు ఒక్క సారి ఆలోచించండి. మరి వారందరికీ చదివిన చదువుకి సరైన ఉద్యోగం లభిస్తుందా! …..

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉంది కానీ  మహారాష్ట్ర లో మరి ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది దానికి కారణం ఈ మధ్య మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( MPSC) విడుదల చేసిన  పోస్ట్ ల వలన తెలిసింది. ఎందుకంటే 5 పోస్టులకే దాదాపు 2500 మంది అప్లై చేశారు. మరి ప్రభుత్వ జాబ్ కోసం ఆ మాత్రం చేయరా! అని మీరు అనుకోవచ్చు కానీ ఈ పోస్ట్  గ్రేడ్ ఢీ (మూటలు మోసే పని) కి సంబంధించినవి. ఇక ఇందులో ఆశ్చర్య పడవలసిన విషయం ఏమిటంటే ఈ జాబ్స్ కోసం 5 మంది యం.పిల్. అభ్యర్థులు మరియు 253 పి.జి. అభ్యర్థులు అలాగే 984 డిగ్రీ అభ్యర్థులు అప్లై చేశారు. మరి ఈ జాబ్ కి కావలసిన అరహత ఎంత అనుకుంటున్నారు కేవలం 4వ తరగతి. మరి ఈ జాబ్ లకు 10 వ తరగతికి తక్కువగా చదివిన వారు అప్లై చేసినవారు కేవలం 117 మంది మాత్రమే. ఈ జాబ్స్ కోసం MPSC అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూ చేయవలసి ఉండగా చాలా మంది ఉండటంతో మొదటగా వీరికి ఎగ్జామ్ పెట్టి ఆ ఆతర్వాత వీరిని ఇంటర్వ్యూ చెయ్యనున్నారు. ఈ ఎగ్జామ్ ఆగస్టు లో నిర్వహించనున్నారు.

Railway

ఎందుకు డిగ్రీ చేసిన మీరు ఇలాంటి జాబ్ కు అప్లై చేశారు అని వివేక్ అనే విధ్యార్థిని అడిగితే … ఏ జాబ్ లేకుండా ఉండే కంటే ఏదో యక జాబ్ చేయడం మంచి అనే భావముతో చాలా మంది ఉన్నారు అందులో నేను ఒక్కడిని అని అన్నాడు.ఇలాంటి పరిస్థితి ఒక  మహారాష్ట్ర లోనే కాదు ఇంతకు ముందు కూడా చదివిన చదువుకు అప్లై చేసిన జాబ్ కు సంబంధం లేకుండా చాలా మంది అప్లై చేశారు అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరిలో యు.పి లో హంరోహ మున్సిపాలిటీ వారు విడుదల చేసిన స్లీపర్ జాబ్స్ కోసం వారు 19 వేల మంది అప్లై చెయ్యగా అందులో ఎక్కువగా బి.ఏ. లాగే బి.యస్సి, యం.ఏ. బిటెక్, యం.బి.ఏ వారు ఎక్కువగా ఉన్నారు.పోయిన సంవత్సరం ఛత్తీస్ ఘడ్ లో 70 వేల మంది కేవలం 30 ప్యూన్ పోస్ట్ లకు అప్లై చేశారు అలాగే రాజస్థాన్ లో 23,500 ల మంది కేవలం 5 ప్యూన్ పోస్ట్ లకు అప్లై చేశారు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద డిగ్రీలు, ఇంజినీరింగ్ చదువులు చదివిన చాలా మంది కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేశారు, రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతుంది, దీనిని నిర్ములించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిరుద్యోగులకు సరైన ఉపాధి కల్పించాలి.

(Visited 938 times, 1 visits today)