Home / Entertainment / ధ్యాంక్స్, లవ్ యు ఆల్ డార్లింగ్స్ – ప్రభాస్

ధ్యాంక్స్, లవ్ యు ఆల్ డార్లింగ్స్ – ప్రభాస్

Author:

prabhas

2015 ని గుర్తుంచుకునేలా చేసిన డార్లింగ్స్ అందరికి ధ్యాంక్స్, లవ్ యు ఆల్ అండ్ హ్యాపి హ్యాపి 2016 అంటు బాహుబలి ప్రభాస్ తన ఫేస్ బుక్ ఖాత ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక ‘బాహుబలి’ రెండో భాగం రీసెంట్ గా మొదలైంది. ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ”బాహుబలి – ది కంక్లూజన్‌’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ”బాహుబలి – ది కంక్లూజన్‌’ వచ్చాక ‘బాహుబలి – ది బిగినింగ్‌’ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు… ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి”అన్నాడు.

(Visited 138 times, 1 visits today)