Home / health / రాత్రి మీ బెడ్ పక్కన ఒక నిమ్మకాయ ముక్క ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?

రాత్రి మీ బెడ్ పక్కన ఒక నిమ్మకాయ ముక్క ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?

Author:

నిమ్మకాయ, నిమ్మ రసం.. ఇవి లేకుండా, వీటిని వాడకుండా ఏ వంటిల్లూ ఉండదు. వంటలో రుచికి నిమ్మ రసం తగలాల్సిందే. వేడి వేడి అన్నానికీ పుల్లని నిమ్మ పచ్చడి ఉంటె ఆహా ఏమి రుచీ అని లొట్ట లేస్తూ తినాల్సిందే. ఇక జలబు చేసినప్పుడూ లెమన్ టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ మనకు తెలిసినవే ..కానీ ఇవేకాక నిమ్మ లేదా లెమన్ వల్ల ఇంకెన్నో లాభాలున్నాయని జపాన్ కు చెందిన డాక్టర్లు, పరిశోధకులు రీసర్చ్ చేసి మరీ చెబుతున్నారు. అవేంటో ఇవాళ తెలుసుకుందాం.

benefits of lemon-1

  • మనం పడుకునే ముందు ఒక్క నిమ్మ ముక్క లేదా బద్దని గనక మన దిండు పక్కన పెట్టుకుంటే రూమంతా నిమ్మలోని సిట్రస్ వ్యాపించి మనసుని ఉల్లాసపరుస్తుందట. రోజంతా పని చేసి వచ్చిన కష్టాన్నీ, అలసటనీ, స్ట్రెస్ నీ టెన్షన్ నీ తగ్గించి మనసునీ, తద్వారా శరీరాన్నీ తేలిక పరుస్తుంది. రిలాక్సింగ్ టానిక్ లా పని చేస్తుంది. నిమ్మ ఆయిల్ ని రూమ్ ఫ్రెష్ నర్ లా వాడినా మంచి ఫలితం ఉంటుందట.
  • అలాగే ఈ నిమ్మ రసాన్ని గనక ఆవిరి లాగ పీల్చితే, కాన్సంట్రేషన్ పెరుగుతుందట. మానసికంగా ఉత్తేజ బరితం అవ్వడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరిగి చలాకీగా తయారవుతారు. చేసే పని లో కూడా యాక్టివ్ గా ఉంటూ మరింత చురుకుగా పని చేస్తారంట.
  • బీపీ ఉన్నవారికి, ముఖ్యంగా లో బీపీ ఉన్నవాళ్లు, ఈ నిమ్మ వాసన ని పీల్చడం వల్ల బీపీ సాధారణ స్థితికి వస్తుందట. హైపర్ టెన్షన్ ని కూడా దూరం చేస్తుంది ఒక్క నిమ్మ బద్ద .ఇక డిప్రెషన్ కి చెక్ పెట్టాలంటే లెమన్ ఆయిల్ వాడాల్సిందే. లెమన్ ఆయిల్ డిప్రెషన్ కి దివ్యౌషధం లా పని చేస్తుందంటున్నారు జపాన్ డాక్టర్లు.
  • ఇక ఇంట్లో ఉండే దోమలు, బ్యాక్తీరియాల వల్ల ఇబ్బంది పడే వారికీ ఈ నిమ్మ కాయ అద్భుతమైన మేలు చేస్తుందట. సగం కోసిన నిమ్మ కాయ ముక్క లో కొన్ని లవంగాలని గుచ్చి రూమ్ లో పెడితే దెబ్బకు దోమలతో పాటూ బ్యాక్టీరియా, దుర్వాసన లాంటివన్నీ మటుమాయం అవ్వాల్సిందే.
  • ఒక్క నిమ్మ ముక్క వల్ల ఇన్ని లాభాలుంటే ఇంకెందుకాలస్యం ..జేబులోనో, రూములోనో ఒక నిమ్మకాయ ఉంటే చాలు ఇంకా నో మోర్ టెన్షన్..
(Visited 3,975 times, 1 visits today)