Home / health / మీ పిల్లలని ప్లాస్టిక్ బొమ్మలకి దూరంగా ఉంచండి.

మీ పిల్లలని ప్లాస్టిక్ బొమ్మలకి దూరంగా ఉంచండి.

Author:

మార్కెట్లో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ బొమ్మలు రకరకాల రంగులతో పిల్లలని తొందరగా ఆకర్షిస్తాయి. జనాలని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రజకు వేటిపైనా మక్కువ పెంచుకుంటున్నారో, వాటినే ప్లాస్టిక్ బొమ్మల రూపంలో విడుదల చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. అవి కావాలని పిల్లలు మారాం చేసినప్పుడు అవి వారి కోసం తీసుకోక తప్పదు. కానీ, ఈ ప్లాస్టిక్ బొమ్మలు చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

‘ఇంఫ్లూ ఎంజా’ అనే వైరస్ ఈ ప్లాస్టిక్ బొమ్మలకు అంటిపెట్టుకొని ఉంటుందని.. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుతున్న సమయంలో వాటి నుండి వారి శరీరంలోకి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని అమెరికాకి చెందిన జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు.

ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని, దీని ప్రభావం వల్ల 24గంటల్లో చిన్నారులు అనారోగ్యానికి గురి అవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులకి ఈ ప్లాస్టిక్ బొమ్మలకి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇకనైనా ఈ ప్లాస్టిక్ బొమ్మల కొనుగోలుకి స్వస్తి చెప్పి పిల్లల ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి.

(Visited 402 times, 1 visits today)