Home / Inspiring Stories / రష్యా పర్యటన లో మరో వివాదానికి కేంద్రబిందువైన మోడీ.

రష్యా పర్యటన లో మరో వివాదానికి కేంద్రబిందువైన మోడీ.

Author:

ప్రధాని మోడీ మరో వివాదం లో ఇరుక్కున్నారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ మాస్కో చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు రష్యా అధికారులు ఘనస్వాగతం పలికారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని లాండ్ అవగానే ప్రోటో కాల్ నిబందనలమేరకు రష్యా అధికారులు భారత దేశ జాతీయ గీతమైన “జన గణ మన” ప్లే చేసారు. కానీ మోడీ అదేం వినిపించుకోకుండానే ముందుకు నడిచారు. దీన్ని గమనించిన మరో అధికారి మోడీ చెయ్యి పట్టుకొని ఆపి వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టారు. అప్పుడు అసలు విశయం అర్థమైన మోడీ జాతీయ గీతం అయ్యేవరకూ నిలబడ్డారు. ఇప్పుడు ఆ వీడియో నెట్ లో పాపులర్ అయ్యింది. కనీసం మన దేశ జాతీయ గీతాన్ని కూడా పట్టించుకోని మోడీ ప్రవర్తన మీద విమర్షలు వెల్లువెత్తుతున్నాయి..

అయితే మన ప్రధాని ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవటం ఇదే మొదటిసారేం కాదు. ఇదివరలో మలేషియా పర్యటనలో కూడా తలకిందులుగా ఉన్న భారత పతాకాన్ని గమనించకుండా దాని పక్కనే నిలబడి ఉండటం పలు విమర్షలకు దారి తీసింది. దానికి ముందు అమెరికా పర్యటనలోనూ జాతీయ పతాకం విషయంలో ఇలాంటి వివాదమే చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భారత జాతీయ పతాకాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారట. అయితే, అది మోడీ సంతకం చేసిన పతాకం కావడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. సంతకంతో కూడిన ఆ పతాకాన్ని మిషెలిన్ మాస్టర్ చెఫ్ వికాస్ వర్మకు అందజేసి ఆయన చేతుల మీదుగా ఒబామాకు బహుమతిగా ఇవ్వాలని మోడీ సూచించారు.

ఈ నేపథ్యం లో తాజా రష్యా పర్యటనలోనూ మోడీ ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది.ఈ పర్యటనలో భాగంగా మాస్కోలో ద్వైపాక్షిక వార్షిక సదస్సులో మోడీ పాల్గొననున్నారు.గురువారం జరిగే 16వ ఇండియా-రష్యా వార్షిక సమావేశంలో మోడీ, పుతిన్‌లు పాల్గొంటారు. ఆర్థిక, అణుశక్తి, రక్షణ సహకారంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. భారత్‌, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలపైనా మోదీ, పుతిన్‌ చర్చించనున్నారు. ఇరు దేశాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలతో వీరు భేటీ అవుతారు.ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే పదేళ్లలో 30 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరుదేశాల లీడర్లు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

 

(Visited 174 times, 1 visits today)