Home / Inspiring Stories / ఆదివాసీ పిల్లల కోసం మనసున్న పోలీస్ త్యాగం.

ఆదివాసీ పిల్లల కోసం మనసున్న పోలీస్ త్యాగం.

Author:

Police Helping 40 poor people

అరూప్ ముఖర్జీ న్యూ అలీపూర్ పోలీస్ స్టేషన్ లో పని చేసే అందరు సాధారణ పోలీస్ కానిస్టేబుల్ల మాదిరిగానే కనిపిస్తాడు.కానీ అతను మాట్లాడటం మొదలుపెట్టాక గానీ అర్థం కాదు మనం మాట్లాడే వ్యక్తి ఎంత సాహసాన్ని తన కలల్లో మోస్తున్నాడో.. తనుండే ఊరినుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న పసివాళ్ళ భవిశ్యత్తుని గొప్పగా ఉండేలా చేసేందుకు ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది. పశ్చిమబెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న ఆదివాసీ పిల్లలకోసం నడిపే “పంచ నబడిశా మోడల్ స్కూల్ ” అనే పాఠశాల కోసం తన పూర్తి జీతాన్ని ఇచ్చేస్తున్నాడు. ఈ సబర్ అనే తెగ రాష్ట్రం లోనే అత్యంత వెనుకబడ్డ,నిరాక్షరతా ఉన్నతెగ.. “టాయిలెట్లూ,బెంచీలూ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్న ఆ పిల్లల పరిస్తితి నన్ను కదిలించి వేసింది. వారికోసం నాకు వీలైనంతవరకూ ఏదైనా చేద్దామనుకున్నాను.నలబై మంది సబర్ జాతి పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కానీ వారికి ఏమాత్రం సరైన సౌకర్యాలు లేవు. దానికోసం కలకత్తాలో కొన్ని విరాళాలు కూడా సేకరిస్తున్నాం వారికి సరైన బట్టల కోసం,మిగిలిన అవసరాలకోసం కూడా. నా ఒక్కడి సంపాదనతో అన్నీ చేయలేకపోతున్నా..” అంటాడు ముఖర్జీ.

police3

ముఖర్జీ ప్రయత్నాన్ని గమనించిన అతని సహోద్యోగులూ సీనియర్ లూ కొంత సాయం చేస్తున్నారు కూడా,అతనేప్పుడైనా పూన్చా వెళతాడు. అక్కడే ఆపిల్లలతో గడుపుతాడు. పక్కనే ఉన్న సబర్ బ్లాక్ హాస్పిటల్ కి వచ్చేయ రొగుల బందువులు ఆ పాఠశాలలోనే షెల్టర్ తీసుకుంటూంటారు. అయితే ముఖర్జీ వారిని వద్దనడు కానీ ఆ పిల్లల పరిస్తితి వివరించి తోచిన సహాయం చేయమంటాడు. అలా అడిగినందుకు అతనేం సిగ్గుగానో,నామొషీ గానో ఫీలవడు కూడా.. ఎలా అయినా ఆపిల్లల కు కావలసినవి సమకూరి వాళ్ళు చదువుకుంటే చాలు అంటాడు…

ఈ పరయత్నం లో కేవలం తన ఉద్యోగం పైన వచ్చే డబ్బుసరిపోదని అతనికీ తెలుసు అందుకే అతను తన ఆశయాన్ని నెరవేర్చుకోవటం కోసం కేవలం తన జీతమ్మీద మాత్రమే ఆధారపడి లేడు, అంతే కాక ఈమధ్య ఒక దొంగని పట్టికునే సమయం లో గాయపడ్డాడు కూడా అందుకే అతను మరిన్ని విరాళాలు సేకరించే పనిలో ఉన్నాడు ఎప్పటికైనా ఆ ఐదు గదుల పాఠశాలని “ఆదర్శ పాఠశాల” గా చూడాలన్న అతని కల నెరవేరాలని కోరుకుందాం…

(Visited 126 times, 1 visits today)